Natyam ad

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు  నటరాజ,  కృష్ణారావు బృందం మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించారు.ఉదయం 10 నుండి 11 గంటల వరకు నరసరావుపేటకు చెందిన  సత్య శ్రీనివాస అయ్యంగార్ ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సుశీల బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జయంతి సావిత్రి భాగ‌వ‌తార్‌ హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమతి రేవతి శ్రీమతి కవిత బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వందన బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

 

 

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి ఉషారాణి, శ్రీ హరినాథ్ నృత్యం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి నెల్లూరుకు చెందిన సుధాకర్ బృందం సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద హైదరాబాదుకు చెందిన శ్రీమతి లక్ష్మి బృందం సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి మచిలీపట్నం చెందిన శ్రీ వైష్ణవి నృత్యాలయం వారిచే నృత్య కార్యక్రమం జరిగింది.

 

Post Midle

Tags: Cultural splendor of Sri Padmavati Ammavari Brahmotsavam

Post Midle

Leave A Reply

Your email address will not be published.