Natyam ad

చోరీల్లో కన్నింగ్ ప్లాన్

నల్గోండ ముచ్చట్లు:

మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల దొంగతనాల గురించి విని ఉంటారు. తెలివిమీరిపోయిన దొంగలు పోలీసులకు చిక్కకుండా తమ చేతి వాటం ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖాని మాస్కులు వేసుకోవటం, ఫింగర్ ఫ్రింట్స్ దొరక్కుండా జాగ్రత్తపడటం చేస్తుంటారు. డాగ్ స్కాడ్ తెప్పించినా.. కుక్కలు వాసన పసిగట్టకుండా కారం పొడి లాంటివి చల్లటం గురించిన వార్తలను మనం చూసే ఉంటాం. కానీ ఈ దొంగలు మాత్రం బాగా అప్డేట్ అయి ఉన్నట్లుంది. పోలీసులకు దొరక్కుండా కన్నింగ్ ప్లాన్ వేశారు. సీసీ కెమెరాలకు రంగు వేసి ఏటీఎంలో దొంగతానికి పాల్పడ్డారు. ఈ ఘటన నల్గొండ పట్టణంలో చోటు చేసుకుంది.నల్గొండ జిల్లాలో దొంగలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి దాటిందంటే చాలు ఇళ్లలో లేదంటే ఏటీఎం సెంటర్లలో దొంగతనానికి పాల్పడుతున్నారు. తాజాగా.. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. బీటీఎస్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో దుండగులు చోరీ చేశారు. ఈ దొంగలు దొంగతనం చేయటంలో ఆరితేరి ఉన్నట్లు తెలుస్తోంది. ఏటీఎం సెంటర్‌లో బ్యాంక్ అధికారులు రెండు మిషన్లు ఏర్పాటు చేయగా… అందులో ఒక పాత మిషన్‌ను దొంగ తనానికి ఎంచుకున్నారు. మరో ఏటీఎం టెక్నాలజీతో కూడుకున్నది కావటంతో దాన్ని టచ్ చేయలేదు. ఆ మిషన్‌ను ధ్వసం చేయాలని చూస్తే.. బ్యాంకు సెంట్రల్ సెక్యూరిటీ ఆఫీస్‌లో అలారం మోగుతుంది.

 

పాత మిషన్‌లో ఆ టెక్నాలజీ లేదు. దీంతో దొంగలు పాత మిషన్‌ను దొంగ తనానికి ఎంచుకున్నారు.ఇక దొంగ తనం చేసే ముందు దుండగలు చాలా తెలివిగా వ్యవహరించారు. సీసీ కెమెరాలు ధ్వసం చేయకుండా.. కెమెరా లెన్స్‌కు రంగులు వేశారు. అనంతరం తమ పని కానిచ్చేశారు. పాత మిషన్‌ను ధ్వసం చేసి రూ.14,78 లక్షలతో అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం కొందరు స్థానికులు డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్లగా.. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ ఘటనపై ఆరా తీశారు. అయితే ఈ చోరీ ఘటనలో బ్యాంక్ అధికారుల వైఫల్యం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దుండగులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలకు రంగులు వేయడంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ తీరును పాత నేరస్థుల ట్రాక్ రికార్డ్‌తో సరిపోలుస్తున్నారు. త్వరలోనే చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

 

Post Midle

Tags: Cunning plan in thefts

Post Midle