ఫర్టీలైజర్ దుకాణాలకు కర్ఫ్యూ  మినహాయింపు ఇవ్వాలి

ఎమ్మిగనూరు ముచ్చట్లు :
ఫర్టీలైజర్ దుకాణాలకు కర్ఫ్యూ మినహాయింపు ఇవ్వాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం(పి.డి.ఎస్.యు) జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్ర బాబు,ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) తాలూకా నాయకులు నరసింహ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయం లో ఎంఆర్ఓ జయన్న గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ 12 గంటలకె ఎరువుల దుకాణాలు మూసేవేయడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.గత వారం రోజులనుండి కురుస్తున్న వర్ష్యలు కారణంగా రైతులు పంటలు వేసుకోవడానికి  విత్తనాలు,ఎరువులు అందుబాటులో లేకపోవడం వలన చాలా అవస్తాలు పడుతున్నారని అన్నారు.కర్ఫ్యూ ను అలుసుగా తీసుకొని ఫర్టీలైజర్ యాజమాన్యం బ్లాక్ లో రైతుల నడ్డి వీరేచే విదంగా విత్తనాలు, ఎరువులు అధిక దారులకు అమ్ముతూన్నారని అన్నారు.కాబట్టి ఉన్నతి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి ఫర్టీలైజర్ దుకాణాలకు కర్ఫ్యూ మినహాయింపు సమయం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఆషిఫ్, ఏసేపు, చిన్న తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Curfew exemption should be given to fertilizer shops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *