కర్ఫ్యూ కఠినంగా అమలు చేయాలి-జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి

మద్దికేర ముచ్చట్లు :

 

కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయాలని జిల్లాఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు.మండల కేంద్రమైన మద్దికెరలో కర్ఫ్యూ ఆంక్షల అమలును  శనివారం జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరంగా రోడ్లపై కి వచ్చే వాహనాలను సీజ్ చేయాలని సిబ్బందికి సూచించారు.అనంతరం మద్దికేర పోలీసుస్టేషన్ ను తనిఖీ చేశారు.
పోలీసు స్టేషన్ లోని పరిసరాలను,మహిళా హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు.పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా  కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ రూరల్ సిఐ డి.వి నారాయణ రెడ్డి,మద్దికెర ఎస్సై మస్తాన్ వలి మరియు మద్దికేర పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Curfew should be strictly enforced-District SP Dr Fakkirappa Kaginelli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *