కరెంట్ భారంతో ముసుకుపోయిన కంపెనీలు

నల్గొండ ముచ్చట్లు:


రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచిన నేపథ్యంలో, రూ. కోట్లల్లో వస్తున్నా నష్టాన్ని భరించలేక, భారం మోయలేక పలు ప్రైవేటు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆయా ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. కరోనాతో కకావికలమై నష్టాల బాట నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో, ప్రభుత్వం విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచడం ఫ్యాక్టరీ యజమానులను కోలుకోలేని దెబ్బ తీసింది. నష్ట నివారణకు మార్గాలు లేక, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఛార్జీలను తగ్గిస్తుందన్న నమ్మకంలేక ఫ్యాక్టరీలను మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి సమీపంలో ఉన్న సలాక ముడిసరకును తయారుచేసే ఫ్యాక్టరీ గత ఐదు రోజుల క్రితం మూతపడడంతో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు లబోదిబోమంటున్నారు. యూనిట్ కు 2.80 పైసల వరకు అదనపు భారం పడుతోంది. ఒకేసారి ఖర్చు పెరిగిపోవడం రోజుకు లక్ష యూనిట్ల కరెంటు ఖర్చయ్యే ఈ ఫ్యాక్టరీ కి, నెలకు ఒకేసారి 80 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వ్యయం పెరిగిపోవడంతో చేసేదేమీలేక ఫ్యాక్టరీని మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

 

 

కోటి రూపాయలకుతోడు మరో 80 లక్షల రూపాయల వరకు అదనపు భారం పడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని  ఫ్యాక్టరీలో పని చేసేవారు ఆందోళన వ్యక్తం చేశారు. గత 13 సంవత్సరాలుగా ఫ్యాక్టరీలో పని చేస్తున్న సుమారు 200 మంది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మల్, సూర్యాపేట్, షాద్ నగర్, నల్గొండ జిల్లాలో 2 ప్రాంతాలలో ఉన్న ముడిసరకును తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడగా నర్కెల్ ఫ్యాక్టరీ మాత్రమే ప్రస్తుతం నడుస్తుంది. ఆయా ఫ్యాక్టరీలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఉపాధి కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది.రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ ముడి సరుకును తయారుచేసే ఫ్యాక్టరీలు తెరచుకోవాలంటే పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం దిగివచ్చి ఛార్జీలు తగ్గిస్తే తప్ప మూతపడ్డ ఫ్యాక్టరీలు తెరుచుకోవడం కష్టమన్న భావన యజమానులలో నెలకొంది.

 

Tags: Current burdened companies

Leave A Reply

Your email address will not be published.