Natyam ad

అందరికి కరెంట్ కష్టాలు

నెల్లూరు ముచ్చట్లు:


జెన్కో పవర్ ప్లాంట్ కొరకు భూములిచ్చిన గ్రామాల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 1600 యూనిట్లు రెండు పవర్ ప్లాంట్ వైఎస్సార్,  మూడో ప్లాంట్ చంద్రబాబు అనుమతులిచ్చారు. 27న మూడోవ యూనిట్ లాంచ్ చేసి.. 31వ తేదీ ఆదానికి అంకితం చేస్తున్నాడు. 23 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన పవర్ ప్లాంట్ ను ఆదానికి అంకితం చేస్తున్నాడు. అన్ని వసతులు ఉండి కూడా నష్టాల్లో చూపించి జెన్కో ఆదానికి కట్టబెడుతున్నారు. ఒక్క యూనిట్ ప్రొడక్షన్ కి 3.14 అనుమతిస్తే.. 2.70 పైసలకే ఉత్పత్తి చేస్తుంది జెన్కో. టెండర్లు పిలిస్తే సైడు కాలువలకు కూడా వైసిపి ప్రభుత్వంలో రావడంలేదు. ఆదానిని కాదని ఇతరులు జెన్కో టెండర్లలో పాల్గొనగలరా. 151 సీట్లిలిచ్చి పాలించామంటే జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడని అన్నారు.

 

 

ఈ ప్రభుత్వం హయాంలో ఇళ్లకు, రైతులకు, పరిశ్రమలు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ప్రవేట్ కంపెనీ అయ్యింది. కృష్ణపట్నం పోర్టు, కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఆదానికి అంకితం చేయడంమంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలరించుకోవాలి. 27 ముఖ్యమంత్రి పర్యటన కారణంగా గ్రామాలను నిర్బందించారు. ప్రజల్లోకి వచ్చేందుకు ముఖ్యమంత్రికి దమ్ములేదు. వేల మంది పోలీసులు, ఇనుప కంచ, బులెట్ ప్రూఫ్ వాహనాల్లో ముఖ్యమంత్రి పర్యటన సాగుతోందని అన్నారు.

 

Post Midle

Tags: Current difficulties for all

Post Midle