Natyam ad

కోనసీమ జిల్లాల్లో పరదాలు

రాజమండ్రి ముచ్చట్లు:


వానొచ్చింది. వరదొచ్చింది. తగ్గిపోయింది. బాధితులు నా నా తంటాలు పడ్డారు. ఇప్పుడు సీఎం జగన్ ప్రశాంతంగా ఒక రోజు కోనసీమ జిల్లాలో పర్యటించాలని అనుకుంటున్నారు. దానికి మంగళవారం ముహుర్తం పెట్టుకున్నారు. ఈ పర్యటన అధికార వర్గాలకు ముందుగానే తెలుసు. ఏం చేయాలో కూడా చెప్పారు. ఏం చేస్తున్నారంటే పరదాలు కడుతున్నారు. సీఎం జగన్ పర్యటన ఎక్కడెక్కడ ఉండాలో ముందుగానే ఖరారు చేసుకున్నారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో భారీ నష్టం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా చోట్ల పరదాలు కట్టేస్తున్నారు. ఎవరైనా విదేశీయులు వచ్చినప్పుడు దేశ పేదరికాన్ని లేదా మురికివాడల్ని కనిపించకుండా చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేవాళ్లు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ గుజరాత్‌కు వచ్చినప్పుడు ఇలా పరదాలు ఏర్పాటు చేశారు. అలాంటి సంప్రదాయాన్ని దేశీ నేతలెవరూ పాటించలేదు. కానీ సీఎం జగన్ మాత్రం ఎక్కడకు వెళ్లినా హెలిప్యాడ్ నుంచి ప్రోగ్రాం ప్లేస్‌కు వెళ్లే వరకూ పరదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వరద ప్రాంతాలకూ వెళ్తున్నా అదే పరిస్థితి. మూడు రోజుల ముందుగానే పరదాలు ఏర్పాటు చేస్తున్నారు ఏ సీఎం అయినా కష్టాల్లో ఉన్నప్పుడు పర్యటించి భరోసా ఇవ్వాలనుకుంటారు. కానీ జగన్ మాత్రం అన్నీ సద్దుమణిగిపోయిన తర్వాత ఆర్గనైజ్డ్ పోగ్రాంలా ఈ పరిశీలన నిర్వహించాలని అనుకుంటున్నారు. దీంతోనే విమర్శలు వస్తున్నాయి. బాధితులు తమను ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆవేదన ఓ వైపు.. మరో వైపు ప్రభుత్వం చేసుకునే ప్రచారం బాధితుల్ని అసహనానికి గురి చేస్తోంది. సీఎం పర్యటన అనుకూల మీడియాలో చెప్పుకోవడానికి బాధితులు వచ్చి.. బాగా సాయం చేశారని ప్రశసించారని వివరించుకోవడానికి బాగుంటుంది. కానీ నిజంగా బాధితుల గోడు మాత్రం పట్టించుకోకపోతే.. అధికారానికి అర్థం ఉండదు కదా
కొబ్బరికి తీవ్ర నష్టం

 

 


కోన‌సీమ అన‌గానే ముం దుగా వ‌చ్చే మాట కొబ్బ‌రిముక్క‌, కొబ్బ‌రి నీళ్లు… ఎవ‌ర్ని క‌దిలించినా.. కొబ్బ‌రి నీళ్ల మ‌గిమ‌.. మ‌రి.. అంటా రు.  అస‌లు కోన‌సీమంటే మరో కేర‌ళ‌తో స‌మానం. అదంతెహె! అని కాస్తంత  ఆనందం పెల్లు బికిన  గ‌ర్వంతో కూడిన ప్రేమ‌తో ప‌ల‌క‌రించ‌డం స‌దా ఆక‌ట్టుకుంటుంది.  ప్ర‌కృతి అందాలు అంటే ఛండాలంగా  అస‌హ్య‌మైన ఫ్రేముల్లో ఇళ్ల‌లో పెట్టుకునే పెయింటింగ్ బొమ్మ‌లు కాదు.  ప్ర‌తీ ప్రాంతానికి ఓ ప్ర‌త్యేక‌త ఉన్న‌ట్టే కోన‌సీమ ప్ర‌త్యేక‌త కొబ్బ‌రి అన్నాం గ‌దా. కానీ ఇటీవ‌లి ప్ర‌కృతి వైప రీత్యాల‌తో కొబ్బ‌రి రైతు విల‌విల‌లాడుతున్నాడు. వరద రూపం లో  గోదావరి  విలయ తాండవానికి వరద ప్రభావిత ప్రాంత ప్రజలు ఒక పక్క ఆకలి కేకలు,మరో పక్క సహాయక చర్యలు అందక ఇబ్బందులు పడు తుంటే,మరో పక్క కొబ్బరి చెట్లు నీట మునిగి కాపు రాక  రైతులు రోదిస్తున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు, పాశర్ల పూడి గ్రామాలలో పాటు మరి కొన్ని చోట్ల కొబ్బరి రైతులు వరద నష్టం పై ఆందోళన చెందుతున్నారు. ఈ జులై కోన‌సీమ అందాన్ని చింద‌ర‌వంద‌ర చేసింది. ముఖ్యంగా వరదల వల్ల  కొబ్బ‌రి నేల రాలి పోవడంతో  కోట్లలో నష్టం వచిందని వ్యాపారాలు గోల పెడుతున్నారు. కొబ్బరి కాయలు పూర్తిగా తడిసి పోయాయని, తొమ్మిది రూపాయలు పలికే ది  కనీసం రెండు రూపాయలు పలకడం లేదని వాపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  జూలై నెలలో వరదలు వచ్చాయి అని, దాని వల్ల చాలా నష్టపోయాం అని చెప్తున్నారు.వరద నీటి లో తడిసి కొబ్బరి కాయలు కుళ్ళిపోయి ఎందుకూ పనికి రాకుండా పోయాయని కన్నీరు పెట్టుకుంటున్నా రు. కోనసీమ నుంచి దేశం నలుమూలలకి  కొబ్బరి ఎగుమతులు వున్నాయి. కొబ్బరి కాయలు కుళ్ళి ఎగుమతికి పనికి రాకుండా పోయింది అని రోదిస్తున్నారు. ప్రభుత్వం తగిన సహాయం చేయాలనీ రైతులు అభ్య‌ర్ధిస్తున్నారు.  లంక గ్రామాలలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. లంక గ్రామాల్లో వరదలు తీవ్ర నష్టా న్ని మిగిల్చాయి. వరద ముంచెత్తడంతో  పంటలన్నీ నాశనమయ్యాయి. రైతులు దిక్కుతోచని  స్థితిలో పడ్డారు. లంక గ్రామల్లో దాదాపు వేల ఎకారాల్లో పంట నీటిలో మునిగిపోయింది. ఈ  వరదల  కారణంగా  కోట్ల రూపా యిల్లో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవా లని కోరుతున్నారు.

 

Post Midle

Tags: Curtains in Konaseema districts

Post Midle