శ్రీవారి ఆలయ మాఢ వీధుల్లో సివిఎస్వో, అర్బన్ ఎస్పీ పరిశీలన

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంగళవారం టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి కలిసి పరిశీలించారు.అనంతరం సివిఎస్వో  నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. తొలి విడతగా పరిశీలన చేపట్టామని, మరిన్ని సార్లు పరిశీలన చేపట్టి కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు.టిటిడి ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఇఇ  జగన్ మోహన్ రెడ్డి,
తిరుమల అదనపు ఎస్పీ  మునిరామయ్య,విజిఓ  బాలిరెడ్డి, తదితర తిరుమలలోని టీటీడీ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Tags: CVSO, Urban SP inspection in Madha streets of Srivari temple

Leave A Reply

Your email address will not be published.