వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సివిఎస్వో, అర్బన్ ఎస్పీ సమీక్ష
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో జనవరి 13న వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సమీక్ష నిర్వహించారు.వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు ప్రత్యేక దృష్టి సారించి పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం, ట్రాఫిక్‌ను సక్రమంగా నిర్వహించడం, రిసెప్షన్ విభాగాల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.తిరుపతిలోని ఎస్ఎస్డి కౌంటర్ల వద్ద, ఫుట్‌పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సమావేశంలో విజివో బాలిరెడ్డి, ఎస్డిపిఓ ప్రభాకర్, ఎవిఎస్వోలు సురేంద్ర, వీరబాబు, పవన్ కుమార్, శివయ్య, పద్మనాభన్, సిఐలు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: CVSVO, Urban SP review on Vaikuntha Ekadashi arrangements