సైబర్ అలర్ట్ -జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి
చిత్తూరు ముచ్చట్లు:
మీ వ్యక్తిగత సమాచారంతో పాటు మీ వేలి ముద్రలను తరచుగా సమాచారం నిమిత్తం ఎవరికైనా ఇస్తుంటారా ! అయితే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త !. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు వేలి ముద్రలను ఆధారంగా చేసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసంలో మొదటగా సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను అనగా ఆధార్ కార్డు వివరాలు, మీ బ్యాంకు ఖాతా వివరాలు, మీ వేలి ముద్రలను వివిధ మార్గాల ద్వారా సేకరిస్తారు. ఆ విధంగా సేకరించిన మీ యొక్క ఖాతా, వేలి ముద్రల వివరాలను ఉపయోగించి మీ యొక్క ఖాతా నుండి డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. ఈ విధమైన డబ్బును డ్రా చేసే పద్దతినే AEPS (Aadhaar Enabled Payment system) అని అంటారు. ఈ AEPS ద్వారా డబ్బులను పొందటం కోసం మీ యొక్క ఖాతాకు లింకు అయినటువంటి ఆధార్ కార్డు వివరాలతో పాటు మీ యొక్క వేలి ముద్రలు అవసరం. ఈ AEPS withdraw సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే ATM సౌకర్యం అందుబాటులో ఉండదో ఆ ప్రాంతాలలో నగదును ప్రజలు తీసుకోవడం కోసం కల్పించారు. ఈ రకంగా నగదును 10,000/- లోపు మన సౌకర్యం నిమిత్తం డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ రకంగా బ్యాంక్ ఖాతా ను బట్టి ఎన్ని సార్లయినా సైబర్ నేరగాళ్లు ఈ సౌకర్యాన్ని వినియోగించి ఖాతా దారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

🔹 మీరు బ్యాంక్ ఖాతాకు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్ స్థానంలో ఇతర ఐడి ప్రూఫ్ ను ఇవ్వండి.
🔹 మీరు తరచుగా మీ యొక్క ఖాతా బ్యాలెన్సు ను చెక్ చేసుకోండి.
🔹 మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, వేలి ముద్రలను అనవసరంగా ఇవ్వకండి.
🔹 మీకు ఆధార్ ద్వారా డబ్బు ఉపసంహరణ అవసరం లేదు అనుకుంటే మీరు వెంటనే మీ బ్యాంక్ కి వెళ్లి మీ యొక్క ఖాతా కి ఉన్నటువంటి ఆధార్ ద్వారా డబ్బు డ్రా చేసుకునే ఆప్షన్ డిసేబుల్ చేపించుకోవాలి.
🔹Google play store నుండి mAdhaar యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత Open App కి వెళ్లి Access all కు allow చేయాలి.
⬇
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ entry చేసి మొబైల్ కు వచ్చిన ఓటీపీ ని enter చేయాలి.
⬇
ఆధార్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోవాలి.
⬇
Enter Aadhaar number & CAPTCHA number
⬇
Requested OTP అని వస్తుంది.
⬇
Verify entry
⬇
Aadhar lock
Tags: Cyber Alert – District SP Y. Rishanth Reddy
