ఎన్సీఆర్పీ ఆన్లైన్, టోల్ ఫ్రీ నంబర్155260  ద్వారా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయవచ్చు తక్షణం ఫిర్యాదు చేస్తే డబ్బు బదిలీని అడ్డుకోవచ్చు   జిల్లా ఎస్పీ సీంధుశర్మ

.జగిత్యాల ముచ్చట్లు :

 

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) ఆన్లైన్  మరియు టోల్ ఫ్రీ నంబర్155260  ద్వారా కూడా సైబర్ నేరాలపై బాధితులు జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్లో నైనా సైబర్ నేరాలపై బాధితులు ఫిర్యాదు చేయవచ్చునని జిల్లా ఎస్పీ సీంధుశర్మ తెలిపారు.శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ  జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ స్టేషన్ సిబ్బందికివీడియో కాన్ఫరెన్స్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కు సంబందించిన దరఖాస్తు స్వీకరించాలి అని మరియు  నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) ఆన్లైన్  మరియు టోల్ ఫ్రీ నంబర్155260  ద్వారా కూడా సైబర్ నేరాలపై బాధితులు పిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.  జిల్లా లోనిడీఎస్పీ లు ,సీచలు ,ఎస్ హైచ్వో, రైటర్, టెక్ టీం, రిసెప్షన్ లకు మరియు ప్రొబేషనరీ ఎస్స లకు ఐటీ సెల్ హైదరాబాద్ నిపుణుల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా లో నమోదు అయిన సైబర్ నేరాలు వాటిపై చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులపై సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  ఎస్పీ ( ఎన్ సీ) శ్రీ కె. సురేష్ కుమార్ , డిఎస్పీలు వెంకటరమణ, గౌస్ బాబా,ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్,  సిఐలు,ఎస్.ఐ లు  పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Cyber crimes can be reported through NCRP Online, toll free number 155260. District SP Sindhu Sharma said the money transfer could be stopped if a complaint is lodged immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *