Natyam ad

పోలీసుల అదుపులో సైబర్ నేరగాళ్లు

నంద్యాల ముచ్చట్లు:

 


నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరగాళ్లును అరెస్టు చేసి, 2, 71,000 వేల రూపాయలు నగదు ,నాలుగు గ్రాముల రెండు బంగారు నాణ్యాలు వాటి విలువ 26,675 రూపాయలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డిఎస్పి వెంకట్రామయ్య తెలిపారు. బుధవారం పట్టణంలోని గ్రామీణ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకట్రామయ్య మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచనల మేరకు అడిషనల్ ఎస్పి వెంకట్రాముడు పర్యవేక్షణలో ఆళ్లగడ్డ గ్రామీణ సీఐ హనుమంత నాయక్ ,ఎస్ఐ నరసింహులు, ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్లో నమోదైన సైబర్ కేసును చాలెంజిగా తీసుకొని దర్యాప్తు ముమ్మరంగా కొనసాగించి సాంకేతిక నైపుణం ఆధారంగా ముద్దాయిలను గుర్తించడమైనదని డిఎస్పి తెలిపారు. వివరాల్లోకెళితే గత నెల 19వ తేదీన చాగలమర్రిలో నివాసముంటున్న హజీరాంబి అనే మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాను అని పరిచయం చేసుకొని మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా ఒకవేళ చనిపోయి ఉంటే మీకు 35,000 ఆరోగ్యశ్రీ ద్వారా వస్తుంది మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి అని చెప్పినందున ఆమె కు ఫోన్ పే లేనందున ఆమె తమ్ముడు ఫక్రుద్దీన్ కు చెప్పగా ఆరోగ్యశ్రీ కి సంబంధించిన వ్యక్తి అతనితో మాట్లాడగా నీ ఫోన్లో జీరో బ్యాలెన్స్ ఉంటేనే డబ్బు వస్తాయి మీ అకౌంట్లో ఉన్నవి నేను పంపే యూ పీ ఐ, ఐడి కి పంపించు నీకు మొత్తం డబ్బులు ఆరోగ్యశ్రీ డబ్బుతో పాటు తిరిగి పంపిస్తామని చెప్పడంతో ఫిర్యాదు అయినా వ్యక్తి అతని మాటలు నమ్మి అతను పంపిన యూపీఐ, ఐడి కి ఫోన్పే ద్వారా రెండు దఫాలుగా మొత్తం 18,988 రూపాయలు చేశాడు ఎంతసేపటికి ఫోన్ పే లో డబ్బు రానందున అతనికి ఫోన్ చేయగా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సదరు వ్యక్తి మోసపోయానని తెలుసుకొని గత నెల 26వ తేదీన ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును చాలెంజ్ గా తీసుకున్న సీఐ హనుమంత నాయక్ ఎస్ఐ నరసింహులు సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిల వివరాలు తెలుసుకొని ముద్దాయిలు వీరణాల బాలాజీ జమ్మలమడుగు, ఆవుల శ్రీరామ్ జమ్మలమడుగు, గిడ్డంగి మాయ హుస్సేన్ జమ్మలమడుగు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం సమాచారం తెలిపినట్లు డిఎస్పి వెంకట్రామయ్య తెలిపారు. సైబర్ నేరగాల ఉచ్చులో పడవద్దని ,సైబర్ నేరగాల ద్వారా ఇప్పటివరకు 17 మంది మోసపోయినట్లుగా గుర్తించడమైనదని దర్యాప్తులో ఇంకా ఎంతమంది మోసపోయినది తెలుస్తుందని ఇలాంటి నేరాలకు మోసపోయిన వారు ఉంటే ఆళ్లగడ్డ రూరల్ సిఐని సంప్రదించాలని ప్రజలకు ఆయన తెలిపారు. ఈ కేసును చేదించడంలో కృషి చేసిన సీఐ హనుమంతు నాయక్ ఎస్ఐ నరసింహులు కానిస్టేబుల్ నాగరాజ్ కాశీం హోంగార్డు చంద్రబాబులను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి అభినందించినట్లు ఆయన తెలిపారు అలాగే వీరికి డీఎస్పీ వెంకట్రామయ్య ఆధ్వర్యంలోనగదు రివార్డ్ అందజేశారు.

 

Tags: Cyber criminals in police custody

Post Midle
Post Midle