పోత్తులపైనే సైకిల్ ఆశలు

విజయవాడ  ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో దడ ప్రారంభమయింది. ఇప్పటి వరకూ టీడీపీలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని నిబ్బరంగా ఉన్న వారు సయితం ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఈ నియోజకవర్గంలో తాము తప్ప మరే నేత లేరని భావించి గత రెండేళ్లుగా పార్టీని కూడా పట్టించుకోవడం లేదు. అయినా చంద్రబాబు నాయుడు చూస్తూ అప్పుడప్పుడు సున్నిమైన హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కానీ కొత్తగా పార్టీలో తీసుకున్న నిర్ణయం కొందరి నేతలకు భయం పట్టుకుంది.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగా వెళ్లే ప్రసక్తి లేదు. ఇది ఫిక్స్. బీజేపీ, జనసేనలతో కలసి ప్రయాణం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు అంగీకరించకపోయినా చివరి క్షణంలో పొత్తుకు సిద్ధపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికల సమయానికి ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు పదవీ కాలం కూడా పూర్తవుతుంది. దీంతో కొత్త అధ్యక్షుడు టీడీపీతో జట్టుకట్టే అవకాశాలు లేకపోలేదు.

ఇక జనసేన, బీజేపీతో పొత్తుతో కలసి వెళితే టీడీపీ అనేక స్థానాలను కోల్పోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో మెజారిటీని బట్టి కాకుండా మిత్ర పక్షాల కోరిన మేరకు స్థానాలను టీడీపీ అధినేత కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మిత్రపక్షాల డిమాండ్ ను కాదనే ప్రసక్తి ఉండదు. 175 స్థానాల్లో కనీసం 70 నుంచి 80 స్థానాల వరకూ ఈసారి మిత్రపక్షాలకు టీడీపీ వదిలేయాల్సి ఉంటుందనే కామెంట్స్ పార్టీలో విన్పిస్తున్నాయి. అంత కాకున్నా కనీసం యాభై స్థానాలను టీడీపీ వదులుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా తూర్పు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతల్లో కలవరం మొదలయింది. జనసేన, బీజేపీ కొంత బలంగా ఉన్న ప్రాంతాలివే కావడంతో వారు తమ స్థానం ఎక్కడ కూటమిలో భాగంగా కోల్పోవాల్సి వస్తుందోనన్న బెంగ పెట్టుకున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీకి బలమైన నేతలున్నారు. ఓటు బ్యాంకు కూడా ఉంది. అయినా పొత్తు ధర్మంలో భాగంగా వాటిని వదులు కోవాల్సి వస్తే తమ గతేంటన్న భావన ఇప్పటి నుంచే తెలుగుతమ్ముళ్లలో బయలుదేరింది. అందుకే ఇప్పుడిప్పుడే నేతలు యాక్టివ్ అవుతున్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

 

Tags:Cycle hopes on potholes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *