Natyam ad

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుఫాను

అమరావతి ముచ్చట్లు:

మిగ్ జాం -“MICHAUNG” (MIGJAUM అని ఉచ్ఛరిస్తారు) గత 06 గంటల్లో గంటకు 5 కి మీ వేగంతో వాయువ్య దిశగా కదిలింది మరియు ఈ రోజు డిసెంబర్ 3, 2023 , 08 గం. 30 ని .లకు ఉత్తర అక్షాంశం 11.5 ° తూర్పు రేఖాంశం 82.4° వద్ద, అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా దాదాపు 290 కి.మీ, దూరంలోను ,చెన్నైకి ఆగ్నేయంగా 290 కి.మీ,దూరం లోను , నెల్లూరుకు ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలోను,బాపట్లకు ఆగ్నేయ దిశలో 530 కి.మీ,దూరంలోను , మచిలీపట్నానికి దక్షిణ -ఆగ్నేయంగా 530 కి.మీ.దూరంలోను ఉన్నది.ఇది వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ , మరింత బలపడి, డిసెంబర్ 4వ తేదీ ఉదయం నాటికి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ను చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది దాదాపు ఉత్తరం వైపు, దాదాపు దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరానికి సమాంతరంగా మరియు దగ్గరగా కదులుతూ, డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్న సమయంలోపు , తీవ్రమైన తుఫానుగా మారి , గంటకు 90-100 కి.మీ వేగంతో , గరిష్టం గా గంటకు 110 కి మీ గాలుల వేగం తోనెల్లూరు మరియు మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది .

 

Post Midle

Tags: Cyclone formed over Southwest Bay of Bengal

Post Midle