మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్-పలు రైళ్లు రద్దు

రామగుండం ముచ్చట్లు:


మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో చెన్నై నుండి వెళ్లవలసిన పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. దానాపూర్ నుండి బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్ ప్రెస్, గోరకపూర్ నుండి కొచ్చివేలి వెళ్లే రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్, చెన్నై నుండి న్యూఢిల్లీ వెళ్లే జిటి ఎక్స్ ప్రెస్, తిరువనంతపురం నుండి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్ ప్రెస్, చెన్నై నుండి లక్నో వెళ్లే ఎక్స్ ప్రెస్, తిరునల్వేలి నుండి కాట్రా వెళ్లవలసిన ఎక్స్ ప్రెస్, రామేశ్వరం నుండి బనారస్ వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్, కోర్బా నుండి కొచ్చివేలి వెళ్లవలసిన ఎక్స్ ప్రెస్, ఎర్నాకులం నుండి పాట్నా వెళ్ళవలసిన ఎక్స్ ప్రెస్, భగత్ కి కోటి నుండి మన్నార్గుడి వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 7వ తేదీ వరకు అధికారులు రద్దు చేశారు. పరిస్థితిని బట్టి రైళ్ల రద్దు పొడిగించే అవకాశం ఉంది.

 

Tags: Cyclone Michoung effect-cancellation of many trains

Post Midle
Post Midle