Natyam ad

రెండు ఆటోల డీ…8 తీవ్రగాయాలు

పల్నాడు ముచ్చట్లు:


కారపుడి పట్టణంలోని వినుకొండ రోడ్ లో రెండు ఆటోలు ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు .
అక్కడ ప్రజల తెలిపిన  వివరాలు ప్రకారం…. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని వినుకొండ రోడ్ లో గల ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన కూరగాయలు అమ్ముకునే ఆటోలో తమ పిల్లలను మోడల్ స్కూల్లో దించడానికి వెళ్తుండగా అదే సమయంలో బొల్లాపల్లి మండలంలోని మెల్లవాగుకు చెందిన ప్యాసింజర్ ఆటో కారంపూడి వైపు వస్తుండగా అదే సమయంలో వర్షం పడుతుండడంతో రెండు ఆటలు వేగంతో ఢీకొనగా పల్టీలు కొడుతూ దూరంగా పడిపోయాయి.  అందులోని సుమారు 8 మందికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు బాదిత బంధువులు తెలిపారు. క్షతగాత్రులను కారంపూడిలోని ప్రైవేట్ ఆసుపత్రికి మరియు నరసరావుపేట కి 108 లో తరలించారు. క్షతగాత్రులు పేర్లు వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేవి ఇంకా తెలియ రాలేదు.

 

Tags: D of two autos… 8 seriously injured