దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు పథకం-మంత్రి తలసాని
హైదరాబాద్ ముచ్చట్లు:
దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు పథకమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు వెస్ట్ మారేడ్ పల్లి లోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో మంత్రి 28 మంది దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఒకొక్క లబ్ధిదారుడికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతోంది. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం అమలులో లేదు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలి. గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా? మోడీగారు… కార్పొరేటర్ లను ఢిల్లీకి పిలిచి ఒట్టి చేతులతో పంపారు. నగర అభివృద్ధి కోసం నిధులు ఇస్తే ప్రజలకు మేలు జరిగేదని అన్నారు.
Tags: Dalit Bond Scheme for the Development of Dalits – Minister Talasani