Natyam ad

దళిత భూములు దళితులకే చెందాలి

 కడప ముచ్చట్లు:


కడప చిన్న చౌక పొలంలోని సర్వేనెంబర్1137 నుండి 1141 వరకు పాత కడప హరిజనవాడకు చెందిన దళిత మహిళలకు  గత 30 సంవత్సరాల నుండి సాగులోని అనుభవంలో ఉన్న  భూమిని వారికే చెందాలని దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేసింది. కడప తాసిల్దార్ కార్యాలయం నందు దళితులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి  హాజరై మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల క్రితం ఆయా సర్వే నెంబర్లకు సంబంధించిన డీకేటి పట్టాలు, పాస్ పుస్తకాలు రాజముద్రలు వారికి ఇచ్చారని అప్పటినుండి వారు ఆయా పోలాలలో పంటలు వేస్తూ వ్యవసాయం చేస్తున్న భూమిని ప్రస్తుతము  తాసిల్దార్ ఆ భూమి వారిది కాదనడం విచారకరమని ఆయన తెలిపారు. ఈ భూ సమస్యపై గత కొన్ని సంవత్సరాల నుండి తాసిల్దార్ కార్యాలయం నందు ఆందోళన చేస్తున్న దళితులకు వెంటనే తగు న్యాయం చేయాలని ఆ భూమిని ఆన్లైన్ లోకి చేర్చాలని ఆయన కోరారు. దళితులు సాగులో ఉన్న భూమి దళితులకు ఆన్లైన్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు, దీనిపై ఎటువంటి నిర్లక్ష్యం వహించిన సహించేది లేదని దళితులతో ఓ సుదీర్ఘమైన ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, ప్రసాద్, నగర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశు, నాగరాజు, రాయలసీమ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అధ్యక్ష కార్యదర్శులు తస్లీమ్, లక్ష్మీదేవి, నాయకులు అజయ్, ఓబులేసు, సిద్దు, ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

 

Tags: Dalit lands should belong to Dalits

Post Midle
Post Midle