తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా దళితుల నిరసన

రాజోలు ముచ్చట్లు:

 

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో 216 జాతీయ రహదారి పై దలితులు వినూత్న నిరసనకు దిగారు. దళితుల శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి తోట త్రిమూర్తులు ని గవర్నర్ కోటాలో ఎమ్మల్సీ గా నియమించడం పట్ల తహశీల్దార్ కార్యాలయం వరకూ నిరసన ప్రదర్శన చేశారు. దళిత నాయకుడు నల్లి శ్రీనివాస్ గుండు కొట్టించుకుని, మెడలో ముంత, నడుముకి తాటాకు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే తోట త్రిమూర్తులను బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. తరువాత మామిడికుదురు తహశీల్దార్ సుజాత కి వినతిపత్రం అందజేశారు. గవర్నర్ కోటాలో గౌరవ ప్రదమైన వ్యక్తులను ఎమ్మెల్సీ లుగా నియమించేందుకు సిఫారసు చేయాల్సిన ప్రభుత్వం దళితులను శిరోముండనం చేసిన వ్యక్తి ని సిఫారసు చేయడం దారుణమని  అన్నారు. దీనిపై దశల వారీగా ఉద్యమం తీవ్ర తరం చేయడంతో పాటు, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Dalit protest against garden trinity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *