130 కోట్ల రూపాయల నిధులలో దళితవాడలకు వాటా లేదా ? సిపిఐ
బద్వేలు ముచ్చట్లు:
బద్వేల్ పట్టణము మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించిన 130 కోట్ల నిధులలో దళితవాడలకు వాటా లేదా అని మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ప్రశ్నించిన సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు, దళిత కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు పి. వెంకటరమణ ప్రశ్నించారు.ఆదివారం ఉదయం సిపిఐ పట్టణ సమితి, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 32వ వార్డులోని గుంతపల్లి దళితవాడలలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు మాట్లాడుతూ గుంతపల్లి ఎస్సీ కాలనీ అభివృద్ధికి ఆమడ దూరం లో ఉందని ప్రభుత్వాలు మారిన ఇంతవరకు సిసి రోడ్డుకు నోచుకోని వైనం ఈ కాలనీకే దక్కిందని, దీనికి కారణం మున్సిపల్ పాలక పక్ష నిర్లక్ష్య ధోరణికి అడ్డం పడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. మరి ఆ కాలనీకి అభివృద్ధి చేయకపోవడానికి ఎస్సీ కౌన్సిలర్ అని వివక్ష సూపిస్తున్నారా? మనుషులు నివాసాలు లేనిచోట్ల, అధికార పార్టీ నాయకులు కొన్న భూములు, వెంచర్ల దగ్గర ధనిక వర్గాలు నివసించే దగ్గర మాత్రమే వేసిన రోడ్లు దళితవాడలకు ఎందుకు సిసి రోడ్లు వేయలేదని ఆయన ప్రశ్నించాడు. ఇప్పటికైనా పాలకపక్షం, ప్రభుత్వ అధికారులు దళితవాడల పర్యటన చేసి వారి సమస్యలను పరిష్కరించకపోతే మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
Tags: Dalits do not have a share in the funds of 130 crore rupees? CPI