Natyam ad

మంద కృష్ణ మాదిగ పై దళితులు ఫైర్

-మాల మాదిగల మధ్య చిచ్చు పెడతావా..
-దళితులంతా వైకాపా వైపే ఉన్నారు..

-మంద కృష్ణను నమ్మితే బొంద పెట్టీ పోతాడు

-వైయస్సార్సీపీ దళిత నేత రాజా

 

Post Midle

పుంగనూరు ముచ్చట్లు:

మందకృష్ణ మాదిగ తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నాడని మందకృష్ణ మాదిగపై దళిత సంఘాలు నిప్పులు చేరిగారు.సోమవారం ఆయన దళిత సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజా మాట్లాడుతూ మందు కోసం మాదిగ కూటమికి మద్దతిస్తాను అంటూ.. ఆంధ్రాలో ఉన్న మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులంతా వైఎస్ఆర్సిపి పైపే ఉన్నారు. బిజెపిలో పదవుల కోసం ఆరాటపడుతూ.. మోడీ తొత్తుల వ్యవహరిస్తున్న మందకృష్ణ.. మోడీ వద్ద మెప్పు పొందడానికి దళితుల ఆత్మగౌరాన్ని మంటగల్పుతున్నాడని నిప్పులు చెరిగారు. దళితులంతా వైఎస్ఆర్సిపి అభివృద్ధిని సంక్షేమ ఫలాలను చూసి మీ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. పున్నూరులో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అభివృద్ధి 70 సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయలేదన్నారు.

 

 

దళితుల పక్షపాతి మంత్రి పెద్దిరెడ్డి అన్న విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు అన్నారు. శంకరప్ప మాట్లాడుతూ దళితుల మధ్య వేరు కుంపట్లు పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమికి మద్దతిచ్చి బిజెపి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కృష్ణప్ప మాట్లాడుతూ దళితుల పక్షాన పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సిపి పార్టీని అన్నారు. మందకృష్ణ మాదిగ ఓటమికి మద్దతి ఇచ్చి ఆంధ్రాలో మాల మాదిగల మధ్య మంట పెడుతున్నారని అన్నారు. నువ్వు కూటమికి బిజెపికి మద్దతు ఇచ్చిన.. ఒరిగేది ఏమీ లేదని.. ఆంధ్ర రాష్ట్రంలో దళితులంతా వైఎస్ఆర్సిపి వైపే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు రాజా, పెంచుపల్లి కృష్ణప్ప, సర్పంచ్ అంజప్ప, వెంకటరమణ, శంకరప్ప పలు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.

Tags; Dalits fire on Manda Krishna Madiga

Post Midle