Natyam ad

దళితులు వ్యాపారవేత్తలు గా ఎదగాలి-ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి ముచ్చట్లు:
 
దళితులు రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలు గా ఎదగాలని ప్రభుత్వ విప్  గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో దళిత బంధు పైలబ్ధిదారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడేవ్యాపారాలను ఎంచుకొని అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. దళితులు ఆర్థికంగా ఎదగడం కోసమే ఈ పథకం అమల్లోకి తెచ్చారని చెప్పారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనిపేర్కొన్నారు. దళిత రక్షణ నిధి దళిత కుటుంబాలకు దోహదపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.లబ్ధిదారులు వివిధ రకాల యూనిట్లు ఎంచుకొని భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని కోరారు. అవగాహన సదస్సులో వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసుకునే యూనిట్ల వివరాలను ఆయాశాఖల అధికారులు తెలియజేశారు. సదస్సులో  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
 
Tags: Dalits should grow up as businessmen-Government Whip Gampa Govardhan