మార్కెటింగ్ లేని పంటలతో రైతుకు నష్టం

Date:01/06/2020

అమరావతి  ముచ్చట్లు:

పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్ ఫ్లాట్ఫాంపై క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్బేకే పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలి. జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి. మార్కెటింగ్చేయలేని పంటలు వేస్తే.. రైతులు నష్టపోతారని అన్నారు.  ఈ– క్రాపింగ్ మీద గైడ్లైన్స్, ఎస్ఓపీలను వెంటనే తయారుచేయాలి. ఇ– క్రాపింగ్ విధివిధానాలను గ్రామ సచివాలయాల్లో, ఆర్బేకే కేంద్రాల్లో పెట్టాలి. ప్రభుత్వం 30శాతం పంటలను కొనుగోలుచేయాలని నిశ్చయించింది. మిగతా 70శాతం పంటకూడా అమ్ముడయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని అన్నారు. దీనికోసం ఇ–మార్కెటింగ్ ప్లాట్ఫాంను ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు ఉండాలి. ఇ– మార్కెట్మీద పంటను అమ్మాలంటే నాణ్యత అనేది చాలా ముఖ్యమని అయన అన్నారు. గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాససింగ్ లాంటి ప్రయత్నాలు చేయకపోతే నాణ్యతాప్రమాణాలను పాటించలేం. ఈ ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయానికి గ్రేడింగ్, ప్యాకింగ్ అందుబాటులోకి తీసుకోవాలి.వచ్చే కాలంలో జనతాబజార్లకూ ఈవిధానాలు దోహదపడతాయని ముఖ్యమంత్రి అన్నారు.

మాన్సాస్ ట్రస్ట్ కు చైర్మన్ అవుతాను

Tags: Damage to the farmer with non-marketing crops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *