దామోదరరాజు సేవలు అభినందనీయం- ఘనంగా డిఎంఆర్ జన్మదిన వేడుకలు
– పేదలకు సేవ చేయడం దేవుడిచ్చిన వరం
చౌడేపల్లె ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పిటీ సభ్యుడు ఎన్. దామోదరరాజు సేవలు అభినందనీయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పార్టీ నియోజకవర్గపు పరిశీలకులు జింకా వెంకటాచలపతి లు అన్నారు. శుక్రవారం దామోదరరాజు 67 వజన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పార్టీ నేతలతో కలిసి పంజాణి వారిపల్లెలో దామోదరరాజు స్వగృహంలో ఏర్పాటుచేసిన కేక్‌ను పెద్దిరెడ్డి చే కట్‌చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ చౌడేపల్లె, పుదిపట్ల, చారాల, పందిళ్లపల్లె, మేకలచిన్నేపల్లె తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలను అభివృద్దిచేయడం, పందిళ్ళపల్లె, పుదిపట్ల, మర్రిమాకులపల్లె, కాటిపేరి, యల్లంపల్లెతోపాటు పలు గ్రామాల్లో ఆలయాలను నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. దామోదరరాజు ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. దామోదరరాజు మాట్లాడుతూ పేదలకు సేవచేయడం నాఅధృష్టమన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ల సహకారంతో మండలాభివృద్దికి తన వంతు కృషిచేస్తానని తె లిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ నరసింహులు యాదవ్, మాజీ ఎంపీపీలు అంజిబాబు, వెంకటరెడ్డి,రుక్మిణమ్మ ,ఎంపీటిసీ శ్రీరాములు, నాగరత్న, అపర్ణ,గంగులమ్మ, మాజీ ఎంపీటీసీలు పద్మనాభరెడ్డి, రమేష్‌బాబు, సర్పంచ్‌లు కృష్ణారెడ్డి, వరుణ్‌భరత్, షంషీర్‌భాషా, కదిరప్ప, రఘునాథరెడ్డి,విజయకుమారి,సోని,రిజ్వానా,భాగ్యవతి, లక్ష్మిదేవమ్మ తదితరులున్నారు.

Tags: Damodararaj’s services are commendable – DMR’s birthday celebrations are grand
