ఎన్నికల గోడౌన్ ను  తనిఖీ చేసిన దానకిషోర్

Danakishore checked the election wallown

Danakishore checked the election wallown

Date:16/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
శాసన సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సిబ్బందికి అందజేసే పోలింగ్ మెటిరీయలు ను  భద్రపరిచిన గోడౌన్ ను  జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ పరిశీలించారు. దాదాపు 24వేల మంది సిబ్బంది పాల్గొనే ఈ ఎన్నికల విధుల నిమిత్తం ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే 74 రకాల ఎన్నికల సామాగ్రి జీహెచ్ ఎంసీ కార్యాలయానికి చేరుకుంది. ఈ ఎన్నికల సామాగ్రి జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ నేడు తనిఖీ చేశారు. వివిప్యాట్ లో  ఉపయోగించే రోల్స్, చట్టబద్దమైన పత్రాలు, ఫారాలు, స్టేషనరీ సామాగ్రిని గోడౌన్ లో  భద్రపరిచారు. కమిషనర్ తో  పాటు అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, ఎన్నికల విభాగం జాయింట్ కమిషనర్ పంకజ తదితరులు ఉన్నారు.
Tags:Danakishore checked the election wallown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *