Natyam ad

గుంటూరులో కార్పొరేటర్ల దందా

గుంటూరు ముచ్చట్లు:
 
దశాబ్దకాలంగా అధికారుల పాలనలో ఉంది గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌. ఎన్నికలు జరిగాక.. కొత్త పరిపాలన అందిస్తామని ప్రమాణం చేసి మరీ వాటాల వసూళ్లలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారట కొందరు కార్పొరేటర్లు.అధికారుల పాలనలో ఉన్నప్పుడు ఏ పనికైనా.. సీక్రెట్‌గా ఆఫీసర్స్‌ ట్యాక్స్‌ వసూలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో నగరంలో వేసిన రోడ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనేది ఓపెన్‌ సీక్రెట్‌. ఆ ప్రాంతంలోని పెద్దల నుంచి లోకల్‌ కాంట్రిబ్యూషన్‌ పేరుతోనే 20 నుంచి 30 శాతం కమీషన్‌ వసూలు చేసేవారట. అడిగేవాళ్లు లేకపోవడంతో ఇలా పదేళ్లపాటు ప్రజలను పిండేశారని చెబుతారు. ఒక్క రోడ్లే కాదు.. అనుమతులు లేని భవనాలను కాపాడటానికి సైతం పెద్ద మొత్తంలో ఆఫీసర్స్‌ ట్యాక్స్‌ వసూలు చేసేవారట. ఇవన్నీ కళ్లారా చూసిన కొందరు స్థానిక నేతలు.. మొన్నటి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. అన్ని ఆంశాలను ఆకళింపు చేసుకుని.. కార్పొరేటర్లుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దుకాణం తెరిచేశారట.నిర్మాణంలో ఉన్న భవనాలు.. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు.. తమ డివిజన్‌ పరిధిలో ఉన్న ఇతర కట్టడాలను జల్లెడపట్టి ఓ జాబితా సిద్ధం చేశారట. మీ భవనంలో ఈ లోపం ఉంది.. ఆ గీత దాటారు.. పాలనా అనుమతి లేదు అని బెదరగొట్టి.. అదరగొట్టి వసూళ్ల పర్వం మొదలుపెట్టారట కార్పొరేటర్లు. ఇదేకాదు… కొత్త బిల్డింగ్‌ కట్టాలన్నా.. షాప్‌ ఓపెన్‌ చేయాలన్నా ‘ నా సంగతి ఏంటి?’.. నా వాటా ఉంటుందిగా అని ఓపెన్‌గానే అడిగేస్తున్నారట. కొత్తగా కార్పొరేటర్లు అయిన కొద్దిమందిని పక్కనపెడితే.. ఎమ్మెల్యేల ఆశీసులతో కార్పొరేటర్లు అయినవాళ్లు, రాజకీయంగా ముదిరిపోయిన కార్పొరేటర్లు తగ్గేదే లేదన్నట్టుగా వసూళ్లు చేస్తున్నారట. దీంతో గుంటూరు ట్యాక్స్‌ పరాకాష్టకు చేరుకున్నట్టు సమాచారం.
 
 
గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో 2020లో శంకుస్థాపన చేసిన భవనానికి 2021 డిసెంబర్‌లో గుంటూరు ట్యాక్స్‌ వసూలు చేశారట. బ్రాడీపేటలో షాప్‌ల బోర్డులు పీకించడంతోపాటు.. కొత్తపేటలో కారు గ్యారేజీ యజమానిని బెదిరించడం.. తదితర ఘటనలను ఉదహరణాలుగా చెబుతున్నారు జనం. ఆయా డివిజన్లకు కార్పొరేషన్‌ అధికారులు వచ్చినా.. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వచ్చినా.. తమ పర్మిషన్‌ లేకుండా ఎలా వస్తారని కొందరు కార్పొరేటర్లు నిలదీస్తున్నారట. దీంతో బాధిత అధికారులు తాము ఉద్యోగం చేయాలా వద్దా అని మేయర్ దగ్గర పంచాయితీ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు ఆఫీసర్లు సెలవులు, ట్రైనింగ్‌ పేరుతో గుంటూరు నుంచి జంప్‌సమస్య పెద్దది అవుతుందని అనుకున్నారో ఏమో.. అధికారులకు, కార్పొరేటర్లకు మధ్య గ్యాప్‌ పెరగకుండా.. సయోధ్య చేసేందుకు ఇద్దరు పెద్దలు అవగాహనా శిబిరం ఏర్పాటు చేశారట. అక్కడా రాజీ కుదరలేదట. పైగా మీటింగ్‌ ఏర్పాటు చేసిన ఆ ఇద్దరూ.. భవన నిర్మాణదారులు, స్థానిక వ్యాపారులపై చిందులేశారట. ఇదేం పంచాయితీ అని స్థానికులు బెదిరిపోతున్న పరిస్థితి ఉంది. మరి.. గుంటూరు ట్యాక్స్‌ దినదిన ప్రవర్థమానం అవుతుందో లేక పార్టీ పెద్దలే నాటకీయంగా ముగిస్తారో చూడాలి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Danda of corporators in Guntur