ప్రమాదకరంగా హై వే రోడ్డు

ఖమ్మం ముచ్చట్లు:


ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్ళే హై వే రోడ్డు కిష్టారం వద్ద ప్రమాదకరంగా మారాయి. సింగరేణి వాహనాలు రాకపోకలు కారణంగా హై వే రోడ్డు సైతం దెబ్బతింటున్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బొగ్గు రవాణాను గూడ్స్ రైలు మార్గం ద్వారా రవాణా చెయ్యాల్సి ఉండగా…అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీ టిప్పర్ల తో బొగ్గు ను హై వే రోడ్డు మార్గం గుండా రవాణా చేయించడం జరుగుతుంది. ఈ భారీ వాహనాల రద్దీకి రోడ్డు ధ్వంసం అయ్యి హై వే కాస్తా మట్టి రోడ్డున తలపిస్తుంది. అటుగా వెళ్ళే ద్విచక్రవాహన దారులకు.. కిష్ఠారం గ్రామస్థులకు హైవే మీద వచ్చే దుబ్బ కారణంగా తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. కిష్టారం నుంచి ఖమ్మం వైపు ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అర చేతిలో పట్టుకుని జర్నీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.సింగరేణి అధికారులు,NHAI అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు మండిపడుతున్నారు.

 

Tags: Dangerous highway road

Post Midle
Post Midle
Natyam ad