దర్బంగా నిందితులకు ఐఎస్ఐతో సంబంధాలు

హైదరాబాద్  ముచ్చట్లు:
నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్  లకు పాకిస్థాన్ ఐఎస్ఐ తో సంబంధాలు వున్నాయని ఎన్ఐయే గుర్తించింది.  ధర్బంగా బ్లాస్ట్ కేసుల నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాన్ని పేర్కోంది.  లష్కరే తోయిబా కు చెందిన ముఖ్యనేత ఆదేశాల మేరకే మాలిక్ బ్రదర్స్ హైద్రాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్  ధర్బంగా  ఎక్స్ప్రెస్ లో బాంబు  పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర పన్నారు. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఐఎస్ఐ  ముఖ్య నేత ఇక్బాల్ వ్యూహ రచన చేసాడు. 2012 లో పాకిస్థాన్ వెళ్లిన ఇమ్రాన్ మాలిక్  కు ఇక్బాల్  ఉగ్ర కుట్ర కు శిక్షణ ఇచ్చాడు. మాలిక్ సోదరులతో పాటు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సలీం, ఖాఫిల్ కు  శిక్షణ ఇక్బాల్ ఇచ్చాడు.
2016 లో ఈ నలుగురు దుబాయ్ కి వెళ్లినట్టు ఎన్ ఐ ఎ గుర్తించింది. ఇక్బాల్ తో తరచూ సోషల్ మీడియా లో ఇమ్రాన్ మాలిక్ సంభాషణ చేస్తూనే ఉన్నాడు. బాంబ్ తయారీ లో రసాయనాల వాడకం పై యూ ట్యూబ్ లో వీడియోల లింక్ ను ఇమ్రాన్ కు  ఇక్బాల్ పంపాడు. పేలుడు కు సల్ఫ్యూరిక్ గా యాసిడ్,నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ ను మాలిక్ బ్రదర్స్ ఉపయోగించారు. హైద్రాబాద్ లోని చికడపల్లి , హాబీబీనగర్ లో ముడిసరుకులు కొన్నారు.
ఉగ్రవాదులు మొదట ఇంట్లో ట్రయల్ ట్రైల్ నిర్వచించారు. అది సక్సెస్ కావడంతో ఒక టానిక్ సీసా లో రసాయనాలతో మూడింటిని ఉపయోగించి పార్సిల్ లో  మాలిక్ సోదరులు  అమర్చారు. 16 గంటల లోపు ట్రైన్ లో పేలుడు జరిగేలా స్కెచ్ వేసారు. పేలుడు రసాయనాన్ని 50 మిల్లీ లీటర్ల పెట్టడం తో పెద్ద గా భారీ కుట్ర ఫెయిల్ అయింది.
దర్భంగా స్టేషన్ లో పార్సిల్ దించే సమయంలో పార్సిల్ కింద పడటంతో  పేలుడు సంభవించింది. పార్శిల్ పంపిన వ్యక్తి పేరు సుఫియాన్ పాన్ కార్డ్ ను వాట్సప్ లో ఇమ్రాన్ కు ఇక్బాల్ పంపాడు. హైదరాబాధ్ మల్లేపల్లి లో  మాలిక్ ఉగ్రవాద సోదరులు నివాసం ఏర్పచుకున్నారు. భారీ పేలుడుకు ముందు  ఇది శాంపిల్ కుట్ర నా అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్ ఐ ఎ దృష్టి మరల్చి  మరో విధ్వంసం కు ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు కుడా వున్నాయి.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Darbhanga accused have links with ISI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *