చిన్నశేష వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి దర్శనం

తిరుపతి ముచ్చట్లు:

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు గురువారం ఉదయం 7.30 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి చిన్నశేష వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.వాహన సేవలో ఆలయ ఏఈఓ  పార్థసారథి, సూపరింటెండెంట్  సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Tags:Darshan of Sri Venugopalaswamy on Chinnashesha vehicle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *