దసరా కు రెడీ అవుతున్న నోటా

Dasara's Not Ready

Dasara's Not Ready

Date:17/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు :
గీత గోవిందం’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ త్వరలోనే మన ముందుకు ఇంకో సినిమాతో రానున్నాడు. తమిళ…తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘నోటా’ అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు విజయ్. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈసినిమాలో విజయ్ సీఎం పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో కూడా విజయ్ ని సీఎం గా చూపించారు.అయితే ఇందులో విజయ్ పూర్తిస్థాయి సిఎం గా కనిపించడట, కేవలం క్లైమాక్స్ లో 20 నిమిషాల్లో మాత్రమే సిఎం గా కనిపిస్తాడని సమాచారం.
సినిమా చివరి ఇరవై నిమిషాలు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు చిత్ర యూనిట్. అందరికి నచ్చే విధంగా..అలరించేలా క్లైమాక్స్ ఉంటుందని చెప్పుతున్నారు. విజయ్ సిఎంగా ఉన్నంతసేపు సినిమా స్థాయి పీక్స్ లో ఉంటుందని…విజయ్ ఫ్యాన్స్ కు ఆ చివరి ఇరవై నిమిషాలు కాలర్ ఎత్తుకునేలా ఉంటుందని అంటున్నారు.
జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈసినిమాలో మేహ్రిన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈసినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసాడు. మరి విజయ్ ఈసినిమాతో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఒకవేళ ఇది కూడా హిట్ అయితే విజయ్ ఇంకా ఆపడం కష్టమే.
Tags:Dasara’s Not Ready

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *