Dasarayagaripalle Devalaya choice on the bundle of kings

రాజనాల బండ పై దాసరయ్యగారిపల్లె దేవరెద్దు ఎంపిక

– ఉత్కంఠభరితంగా సాగిన ఎంపిక పక్రియ
– సాంప్రదాయ రీతిలో దేవరెద్దుకు పూజలు
– మోట్లపల్లె కేశవులకు చెందిన కోడెదూడే దేవరెద్దు
– జనసంద్రంగా మారిన ఆలయం

Date:05/06/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

సత్యప్రమాణలకు నిలయమైన రాజనాలబండ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద దాసరయ్యగారిపల్లెకు చెందిన దేవరెద్దు ఎంపిక పక్రియ ఆలయ సాంప్రదాయల రీతిలో శుక్రవారం జరిగింది. ఇటీవల ఈ గ్రామానికి చెందిన దేవరెద్దు అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ స్థానంలో కొత్త దేవరెద్దును ఎంపిక చేయాలనే తీర్మాణంమేరకు పరిసర ప్రాంతాల గ్రామస్తులు వారికున్న ఆవు ,కోడెదూడలను ఆలయం వద్దకు తోలుకొచ్చారు. ఆలయ నిర్వాహకులు పళ్లెం( బియ్యం, బెల్లం, అరటిపండు, సర్వశుద్దిఆకుతదితరలు )వేసి ఆలయం ముందుభాగంలో ఒక చోట వేసి బండారు చెల్లడం ఆనవాయితీ.గ్రామస్తులు తీసుకొచ్చిన ఆవు దూడలను వదిలేసి దేవున్ని ప్రార్థిస్తూ డమరుకంను మోగించడం జరుగుంది. పళ్లెంలో గల వస్తువులను ఆవు,దూడలు వెళ్లి తిన్న కోడెదూడను దేవరెద్దుగా గుర్తించి ఎంపిక చేయడం పూర్వీకులనుంచి నేటికూ వస్తున్న ఆచారం. పలు గ్రామాలనుంచి వ చ్చిన దూడల్లో ఏవి తింటాయోనని ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురుచూశారు. ఈ క్రమంలో మోట్లపల్లెకేశవులకు చెందిన కోడెదూడ తినడంతో దాసరయ్యగారిపల్లె దేవరెద్దుగా ఎంపిక చేశారు.అనంతరం ఆలయ అర్చకులు, నిర్వాహకులు, గ్రామపెద్దలు కలిసి మోట్లపల్లెకు వెళ్లి సాంప్రదాయరీతిలో దేవరెద్దుకు పూజలు చేసి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. నేటినుంచి ఆకోడెదూడను తాళ్లతో కట్టకుండా పొలాలపైకి వదిలివేయడం సాంప్రదాయం. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడం విశేషం. కాగా కోవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ ప్రజలెవ్వరూ భౌతిక దూరం, మాస్క్లు సైతం ధరించకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మినర్సయ్య, గ్రామస్థులు నాగభూషణరెడ్డి, విశ్వనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, వెంకటరెడ్డి, ఈశ్వరయ్య, మునిరాజ, శ్రీనివాసులు,చిన్నరెడ్డెప్ప, పెద్దోడు, అర్చకులు కృష్ణమూర్తి తదితరులున్నారు.

 

పేద‌ల‌కు ఉచిత కంటి  వైద్యం అందించాలి

 

Tags: Dasarayagaripalle Devalaya choice on the bundle of kings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *