Natyam ad

పద్మవ్యూహాన్ని చేదించిన అభిమన్యుడు దాసరిపల్లి జయచంద్రారెడ్డి  

తంబళ్లపల్లె ముచ్చట్లు:

తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి నూతన జవసత్వాలు తీసుకువచ్చి కార్యకర్తల్లో నూతన ఉత్సవాన్ని నింపి నియోజకవర్గ వ్యాప్తంగా అనేకమైన సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని తెలుగుదేశం పార్టీ అధినేత ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటింపజేసుకొని తాలూకాలో తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ కార్యకర్తలను నాయకులను కలుపుకొని ముందుకెళ్తున్న సమయంలో రకరకాల రాజకీయ ఎత్తుగడలతో తంబళ్లపల్లి ప్రజానీకాన్ని అభ్యర్థి జయచంద్ర రెడ్డి కి ఇబ్బంది పెట్టాలని దురుద్దేశంతో సామాజిక మాధ్యమాలలో రకరకాల వదంతులను సృష్టించి పైశాచిక ఆనందాన్ని పొందిన విషయం తాలూకాలో ప్రతి ఓటర్ మహాశయునికి ప్రతి ఇంట చిన్నపిల్ల వాడు మొదలు పండు ముసలి వాళ్ళ వరకు కూడా తెలిసింది.

 

 

 

Post Midle

తాలూకాలో రాజకీయంగా నాయకత్వ బీటలు పారిన విషయాన్ని గుర్తించిన అధిష్టానం సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమై మంచి పేరు సంపాదించుకొని సహృదయుడుగా పేరుగాంచిన దాసరిపల్లి జయ చంద్రారెడ్డి రెడ్డి కి అధిష్టానం నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పుడం తో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించింది .. ఇది జీర్ణించుకోలేని కొంతమంది ప్రత్యర్థి పార్టీలకు ఉపయోగపడే విధంగా తమ కుటిల వ్యవహారాన్ని నడిపారు అయినా వారి ప్రయత్నాలు అధినేత సున్నితంగా తిరస్కరించారు. ఇక వారికి మిగిలింది దుగ్ధ మాత్రమే . తంబళ్లపల్లి ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ అణచివేతలకు గురవుతూ అక్రమ కేసులకు భయపడుతూ తమను ఎవరు కాపాడుతారు అన్న భయాందోళనలో ఉన్నప్పుడు దాసరిపల్లి జయ చంద్రా రెడ్డి  ఒక ధ్రువతారగా మెరసి తాను ఉండానంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ తాలూకాలోని రైతాంగానికి యువతకు అన్ని వర్గాల ప్రజలకు అండదండలుగా సేవలందిస్తానని నేను స్థానికుడను నేను లోకల్ అంటూ ముందుకు వచ్చినన్ను ఆశీర్వదించండి మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను అంటూ ముందుకు వచ్చాడు ఇటువంటి తరుణంలో అవకాశాలు రాజకీయాలను అడ్డుపెట్టుకొని రోజుకు ఒక వేషం వేసి పూటకు పూటకు పబ్బం గడుపుకునే విధంగా కర్కషత్వంగా వ్యవహరించి కార్యకర్తలలో ప్రజలలో అపోహలను అనుమానాలను కలిగించాలని చేయని ప్రయత్నం లేదు.

 

 

ఇక మీ నికృష్టమైన నీచమైన ప్రయత్నాలను పక్కన పెట్టండి ప్రజల మంచి కోసం మాతో కలిసి రండి మన జయ చంద్రారెడ్డి నాయకత్వాన్ని బలపరుద్దాం ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం మన నియోజకవర్గాన్ని వివాదరహితంగా శాంతికాముక నియోజకవర్గంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లే విధంగా యువతకు చేతివృత్తుల వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా జయ చంద్రారెడ్డి  చేస్తున్న ఆలోచనలకు మనము తోడుగా నిలుద్దాం మన తాలూకాను మన ప్రజలను మనమే కాపాడుకుందాం.

 

 

ఎంతమంది ఎన్ని కుట్రలు పనైనా చివరకు ధర్మమే విజయం సాధించినట్లు అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటనలో శ్రీకాకుళం క్యాంపు నందు తంబళ్లపల్లి అభ్యర్థి బి ఫాం దాసరిపల్లి జయ చంద్ర రెడ్డి కి అందజేశారు. అన్ని సర్వే రిపోర్టులు నాకు వచ్చాయి. బంపర్ మెజార్టీతో గెలవబోతున్నావు తంబళ్లపల్లి ప్రజలు నీ మీద ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు వారి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా నీ పనితీరు ఉండాలి అది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు స్వతహాగా నీవు ఒక విజన్ ఉన్న నాయకుడు వి నిరంతరం ప్రజలతో మమేకమౌతు పార్టీ కార్యక్రమాలను సక్రమంగా తీసుకువెళ్లి పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయవలసిన బాధ్యత నీదే ఇక మీదట పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో సరైన సమయంలో పని చేస్తూ పార్టీ అధిష్టానం సూచనలతో ముందుకెళ్లాలని ఆదేశిస్తున్నాను అనిజయ చంద్రా రెడ్డి కి అభయం ఇచ్చారు.పరాయి పాలన మనకొద్దు మన పాలనే మనకు ముద్దు
జయచంద్రారెడ్డి నాయకత్వాన్ని బలపరుద్దాం.ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం.

Tags: Dasaripalli Jayachandra Reddy, the Abhimanyu who made the Padmavyuha bitter

Post Midle