Petrol and diesel prices are rising for the 21st consecutive day

పెట్రోల్, డీజిల్, ధరల పెంపు తో సామాన్య ప్రజలపై అధిక భారం

-కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలం
-ప్రధాని మోడీ వైఫల్యం తోనే  20 మంది జవాన్ల మృతి
-కాంగ్రెస్ పార్టీ ధర్నాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు

Date:29/06/2020

జగిత్యాల  ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పెంచుతున్న  పెట్రోల్, డీజిల్ ధరల మూలంగా సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి  డిమాండ్ చేశారు.సోమవారం కేంద్ర ప్రభుత్వంపెంచిన పెట్రోల్, డీజిల్  ధరలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు.ఈ నిరసనలోగంటసేపు కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహానాలు నిలిచిపోయీ రాక పోకలు స్తంభించాయి.
అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు జగిత్యాల అర్డీవో మాధురికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశమంతా గత నాలుగు నెలలుగా కరోనాతో బాదపడుతూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజలపై రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం  ప్రజలను మరింత కుంగదీస్తుందని విమర్శించారు.

 

 

 

ఈ విపత్కర సమయంలో పేదలు, సామాన్యులు, వలసకూలీలు, కార్మికులు, కులవృత్తి దారులు  రోడ్డున పడ్డారని, లాక్ డౌన్ సమయంలో అన్ని రకాల దుకాణాలు, వ్యాపారాలు మూసి ఉంచడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, దీంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ఆదాయ మార్గాలను పెంచుకోకపోవడం దుర్మార్గమన్నారు.2014 లో  ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 50రూపాయలున్న డీజిల్ ధర నేడు 80 రూపాయలకు చేరడం శోచనీయమన్నారు.అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకు తగ్గిపోతుంటే  దేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగడం విచిత్రంగా ఉందన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల నిత్యావసర వస్తువులపై భారం పడి సామాన్యుల నడ్డివిరిచే పరిస్థితులున్నాయని పేర్కొన్నారు.

 

 

 

ఒకవైపు కరోనా నివారణ తోపాటు పేద ప్రజలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ మరోవైపు ఎక్సైజ్ పన్ను రూపేనా  18లక్షల కోట్లు పేద  ప్రజలు నుంచి చార్జీల పేరున వసూలు చేసిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు.
ఆరు సంవత్సరాల బిజేపి కాలంలో సామాన్య ప్రజలపై భారం మోపడం తప్పా ప్రజలకు చేసిందేమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.జీఎస్టీ తో పన్నుల భారం మోపిందని, పెద్ద నోట్లో రద్దుతో  సామాన్యుడు రోడ్డున పడ్డాడనీ,  370ఆర్టికల్ రద్దుతో ఎవరికి లాభం జరుగుతుందని విమర్శిస్తూ, త్రిపుల్ తలాక్ తో ఒరిగిందేమిలేదని, ఇదేనా జాతీయవాదమని జీవన్ రెడ్డి  ప్రశ్నించారు.సామాన్యుని ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోడీ ఏఒక్కరికి లేకపోగా బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.

 

 

రూ.60వేల కోట్లు అప్పులు మాఫీ చేసి పెద్దపారిశ్రామికవేత్తలకు అండగా మోడీ నిలబడ్డారని  ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “ఆయుష్మాన్ భారత్” ను తెలంగాణ లో ఎందుకు అమలు చేయడం లేదని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్ ను ప్రశ్నించారు.కరోనా వ్యాధిని అరికట్టడంలో , పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమేనని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని వ్యాధి వ్యాప్తికి  ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ లే కారణమని  ఆరోపించారు.దేశ సరిహద్దుల్లో చైనా సైనికుల ఘర్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్ల కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలన్నారు.మోడీ వైఫల్యాల వల్లనే 20 మంది దేశ  సైనికులు వీరమరణం పొందారని ,దీనికి ప్రధానమంత్రి మోడీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజావ్యతిరేక విధానాలను నిలువరించి , కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా  సోనియాగాంధీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించామని తెలిపారు.

 

 

 

 

సామాన్యునికి అండగా నిలబడటం మే కాంగ్రెస్ పార్టీ  లక్ష్యమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, బీర్ పూర్ మండల పరిషత్ అధ్యక్షులు మసర్తి రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ,  గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిషాంత్ రెడ్డి, నాయకులు దేవేందర్ రెడ్డి, గజ్జెల స్వామి,  గాజుల రాజేందర్, గాజంగి నందయ్య, దారం ఆదిరెడ్డి, శ్రీకాంత్, నక్క జీవన్, బింగి రవి, గంగం మహేష్, శరత్ రెడ్డి, పులి రాము, తోట నరేష్, గుండ మధు, ప్రకాష్,నేహాల్,  కచ్చు హరీష్,కొంతం రాజు ,నాయిం ,హఫీజ్, ఏఆర్ ఆక్భర్,బేజ్జారపు శ్రీనివాస్, సత్యనారాయణ,కొమిరెడ్డి లింగారెడ్డి, అంజిరెడ్డి,  కుతుబుద్దీన్ ,రహీం తదితరులు పాల్గొన్నారు.

నేతన్నలకు అండగా 

Tags:Heavy burden on the common people with petrol, diesel and price hike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *