Natyam ad

ఐపీఎస్ కూతురు..ఐఏఎస్

నల్గోండ ముచ్చట్లు:

యూపీఎస్సీ- 2022 ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. అందులో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమా హారతి మూడో ర్యాంకు సాధించటం విశేషం. 2022 సంవత్సరానికి గానూ మొత్తం 933 మంది ఎంపిక కాగా.. అందులో మొదటి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. యూపీకి చెందిన ఇషితా కిశోర్‌.. ఫస్ట్‌ ర్యాంకు సాధించగా.. బీహార్‌కు చెందిన గరిమ లోహియా రెండో ర్యాంకు, తెలంగాణకు చెందిన ఉమా హారతి నూకల మూడో ర్యాంకు, యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో ర్యాంకులు సాధించారు. అయితే.. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ సీతారాంనగర్ కాలనీకి చెందిన ఉమాహారతికి.. ఈ విజయం ఆమెకు అంత ఈజీగా రాలేదు. ఇంట్లో ఐపీఎస్ నాన్న ఉన్నాడు.. ఇంకేంటీ.. సులువుగానే క్రాక్ చేసింది అనుకుంటే పొరపాటే. ఆమె కూడా చాలా కష్టపడి ఈ ర్యాంకును సాధించినట్టు చెప్పొకొచ్చారు. ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉమా హారతి.. చిన్నప్పటి నుంచి తాను పెట్టుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని ఛేదించేందుకు.. ఎలాంటి జాబ్‌కు వెళ్లకుండా.. పూర్తి సమయాన్ని ప్రిపరేషన్‌కే కేటాయించారు.

 

 

ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత.. మొదటి సంవత్సరం నుంచే యూపీఎస్సీ పరీక్షలను రాయటం మొదలు పెట్టారు ఉమా హారతి. ఇలా ప్రిపరేషన్‌కు సిద్ధమైనప్పుడే.. వచ్చే వరకు పోరాడాలని నిశ్చయించుకునే దిగారు. ఇలా ఏకంగా ఐదు సార్లు అటెంప్ట్ చేశారు. నాలుగు సార్లు ఫెయిల్ అవుతూ వచ్చి ఐదో సారికి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ కొట్టేశారు. అయితే.. ఈ క్రమంలో.. ఎలాంటి కుంగుబాటుకు లోనవకుండా.. పడిన ప్రతీసారి మరింత గట్టిగా పైకి లేచి ఇప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అయితే.. దానికి కారణం తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్టేనని చెప్పుకొచ్చారు. కంటెంట్, నాలెడ్జ్ కోసం ఎన్నో బుక్స్, మెటీరియల్స్, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయని.. కానీ ఎమోషనల్ సపోర్ట్ మాత్రం కేవలం ఫ్యామిలీ నుంచే దొరకుతుందన్నారు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనకు సపోర్ట్ చేయటం వల్లే తాను ఈరోజు ఈ ర్యాంకు సాధించగలిగానని చెప్పుకొచ్చారు.తాను ప్రిపేర్ అయ్యే ఈ ఐదేళ్లల్లో.. ఇంకెన్ని రోజులు చదువుతావని ఒక్కసారి కూడా తన ఫ్యామిలీ అడగలేదని ఉమా హారతి పేర్కొన్నారు. అలా తాను ఫీలైన ప్రతీ సారి తన ఫ్యామిలీనే ధైర్యం చెప్పి.. ఎమోషన్ సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. తన మీద తన కంటే.. తన కుటుంబానికే తన మీద నమ్మకమెక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను చాలా ఫెయిల్యూర్స్ చూశానని చెప్పుకొచ్చారు.

 

 

 

Post Midle

సివిల్స్ క్రాక్ చేసిన తన ఫ్రెండ్స్ ఇన్‌పుట్స్ తీసుకుని.. ప్రిపేరయ్యానని తెలిపారు. రోజుకు ఎనిమిది నుంచి 10 గంటలు ఒ స్ట్రాటజీతో చదివినట్టు పేర్కొన్నారు. అయితే.. తాను పడిన కష్టానికి ర్యాంకు లిస్ట్‌లో తన పేరు ఉంటే చాలని అనుకున్నానని.. కానీ.. ఇలా మూడో ర్యాంకు వస్తుందని అనుకోలేదని చెప్పుకొచ్చారు.ఉమా హారతి తండ్రి నూకల వెంకటేశ్వర్లు ప్రస్తుతం నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. ఉమా హారతి 3 నుంచి 10 వ తరగతి వరకు హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్‌లో చదువుకోగా.. హైదరాబాద్ ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం సివిల్స్‌ కోసం డిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. అయితే.. ఐఆర్ఎస్‌లో ర్యాంకు రాగా అది వదులుకొని మరోమారు శిక్షణ తీసుకొని మూడో ర్యాంకు సాధించారు. కాగా.. ఉమాహారతే కాదు..

 

 

ఆమె తమ్ముడు సాయి వికాస్ కూడాఐఈఎస్ (ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్) లో అల్ ఇండియా 9 వ ర్యాంకు సాధించి ముంబయిలో ఈ నెల 22న ఉద్యోగంలో చేరారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.అయితే.. తాను విద్యారంగం, మహిళా సాధికరత అంశాలపై సేవ చేయాలనుకుంటున్నట్టు ఉమా హారతి తెలిపారు. ఈ దఫా ఎంపిక కానీ అభ్యర్థులు.. ఏ మాత్రం కుంగిపోకుండా స్ట్రాటజీతో చదవాలని సూచించారు. వాళ్లకు పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలని.. అప్పుడే వాళ్లు సాధించగల్గుతారంటూ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ ఉమా హారతి సూచించారు.

 

Tags:Daughter of IPS..IAS

Post Midle