Kovid patient commits suicide by jumping over rims

తండ్రిని ఉరేసి చంపిన కూతుళ్ళు

-మద్యం మత్తులో కూతుళ్ళ మీద అఘాయిత్యం.

Date:13/08/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట లో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కుతుళ్లపై మద్యం సేవించి లైంగిక వేధింపులకు గురిచేయడంతో కూతుర్ల చేతిలో హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ మహానగరం పరిధిలోని జగద్గిరిగుట్ట సీసాల బస్తీలో జరిగింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సీసాలబస్తీలో గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి మాసాని రాజు (50) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, కూతుర్లు సౌమ్య( 17), రమ్య (16)లు ఉన్నారు. ఇతను స్థానికంగా పిండి గిర్ని లో పనిచేస్తుండేవాడు. ఇతడి భార్య ఎనిమిది నెలల క్రితం ఆత్మహత్య  చేసుకుంది. అప్పటినుండి మద్యానికి బానిసగా మారి ఇంట్లో ఉన్న ఇద్దరు కుతుళ్లను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. నిన్న రాత్రి  సమయంలో అతిగా మద్యం సేవించి లైంగికంగా వేధించడంతో ఇద్దరు కూతుళ్లు రాజు గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆమంచి కృష్ణమోహన్ కు హైకమాండ్ జలక్..?

Tags: Daughters who strangled their father

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *