దావూద్ ఇబ్రహీం సోదరి ఇంట్లో ఈడీ సోదాలు..

ముంబై ముచ్చట్లు:
 
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీమ్ సోదరి హసీనా పార్కర్ ఇంటిని ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఇవాళ విజిట్ చేశారు. అండర్‌వరల్డ్ తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తోంది.దానిలో భాగంగానే ముంబైలో ఉన్న హసీనా ఇంటికి కూడా వెళ్లారు. ప్రాపర్టీ సంబంధిత లావాదేవీల గురించి ఈడీ ఆరా తీస్తున్నది. ముంబైలోని సుమారు పది ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఎన్ఐఏ నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఆ తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ముంబైలో ఇంకా అక్రమ వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇక్బాల్ మిర్జీని కూడా సెర్చ్ చేస్తున్నారు. అండర్‌వరల్డ్ నేరస్థులతో పాటు కొందరు రాజకీయవేత్తలను కూడా ఈడీ ప్రశ్నిస్తోంది.
 
Tags; Dawood Ibrahim’s sister’s house searched ..