Natyam ad

రోజు రోజుకు రేగా కాంతారావు గ్రాఫ్ డౌన్

ఖమ్మం  ముచ్చట్లు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రాఫ్ రోజు రోజుకు డౌన్ అవుతుందని రాజకీయ నాయకులు గుసగుసలాడుతున్నారు. నియోజకవర్గంలో రేగా పరిపాలన విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన రేగా నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అభివృద్ధి మాట పక్కన పెడితే, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, పోడు భూములకు పట్టాలు ఇప్పించడం లేదని, నిత్యం దందాలు చేస్తున్నారని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని ప్రజలు, రాజకీయ వేత్తలు ప్రశ్నిస్తున్నారు. తన లాభర్జన కోసమే టీఆర్ఎస్ లోకి వెళ్లారని కొందరు మరికొందరు చర్చించుకుంటున్నారు. దీంతో పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రాఫ్ పూర్తిగా పడిపోయి, ప్రజలలో భారీ వ్యతిరేక ఏర్పడిందని రాజకీయ నిపుణులు, నిఘావర్గాలు, పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు.ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడే ఆయన రాజకీయ జీవితానికి దెబ్బపడిందని పలువురు మేధావులు గుసగుసలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పేరు టీఆర్ఎస్ పార్టీలో లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగా పేరు చెప్పి కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు దందాలు, దాడులు, గొడవలకు పాల్పడుతున్నారని నియోజకవర్గ ప్రజల నుంచి టాక్ వినిపిస్తోంది.

 

 

నియోజకవర్గంలో భూదందా, ఇసుకదందా, కాంట్రాక్ట్ వర్క్ ల దందా, సెటిల్మెంట్స్ దందా తదితర దందాలు రేగా పక్కన ఉన్న కొంతమంది కార్యకర్తలే చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ దందా చూసినా ఆ కార్యకర్తలే చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ కార్యకర్తలే ఎంతో మంది పేదప్రజల భూములు కబ్జా చేసి, నిత్యం సెటిల్మెంట్స్ దందా చేస్తున్నారని ప్రజలు తెలుపుతున్నారు. ఈ దందాలు ఎమ్మెల్యే రేగా కాంతారావు చేపిస్తున్నారా..? లేక కార్యకర్తలే చేస్తున్నారా..? అనేది చర్చగా మారింది. దీంతో మొత్తానికి కొంతమంది కార్యకర్తల వల్ల ఎమ్మెల్యే రేగాకు నియోజకవర్గంలో భారీ వ్యతిరేకత వచ్చిందని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు.దందాలు, గొడవలు, దాడులు, సెటిల్మెంట్స్, వర్గపోరు వల్లే పినపాక నియోజకవర్గం అల్లకల్లోలంగా మారిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనకొస్తున్నారు. సొంత పార్టీలో ఉన్న నాయకులే ఒకరిపై ఒకరు వర్గపోరుతో దాడులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేగా పక్కన ఉన్న కొంతమంది నాయకుల వల్లే ఇదంతా జరుగుతుందని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. నియోజకవర్గంలో ఎప్పుడు ఏం.. జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గాన్ని పట్టించుకుంటారా…?లేదా అనేది వేచి చూడాల్సిందే.

 

Post Midle

Tags: Day by day Rega Kantha Rao graph down

Post Midle

Leave A Reply

Your email address will not be published.