హర్యానా స్కూల్లో రోజు గాయత్రీ మంత్ర

Date:24/02/2018
 ఛండీఘడ్ ముచ్చట్లు:
భగవద్గీత శ్లోకాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చిన హర్యాణ రాష్ట్ర సర్కారు ఇప్పుడు గాయత్రి మంత్రాన్నిపాఠాశాలల్లో ఉదయం పూట నిర్వహించే ప్రార్థనలో చేర్చింది. ఈ మేరకు హర్యాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. విద్యాప్రమాణాలను పెంచడంతో పాటు నైతికత విలువలను విద్యార్థులకు చిన్నప్పటి నుండే నేర్పించడం పై దృష్టి సారించామని అన్నారు. గాయత్రి మంత్రాన్ని చిన్నప్పటి నుంచే చదివించడం వల్ల ఆ మంత్రంలోని అర్థాన్నివిద్యార్థులు బాగా జీర్ణించుకొని జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని అన్నారు.
Tags: Day gayatri mantra in Haryana school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *