నగరంలో డీ సిల్టేషన్ చేపట్టాలి

– కమిషనరు కలిసి వినతి పత్రం అందచేసిన టీడీపీ నేతలు

 

రాజమహేంద్రవరం  ముచ్చట్లు:

 

చిన్నపాటి వర్షానికే నగరంలోని రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని, దానికి కారణం నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమేనని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. ఈ మేరకు వారు నగరపాలక సంస్థ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందన్నారు. శానిటేషన్ సక్రమంగా చేయడం లేదని, అలాగే డ్రైనేజీల్లో సిల్ట్ సరిగ్గా తీయడం లేదని, ఆ కారణంగా చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి వర్షపునీరు రోడ్లపై ప్రవహిస్తోందని తెలిపారు. శానిటేషన్ విభాగంలో సిబ్బంది కొరత కూడా ఇందుకు ఒక కారణమన్నారు. గోదావరిలో పిండ ప్రదానం కార్యక్రమాలు చేసుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు రాజమహేంద్రవరం వస్తుంటారని, అలాగే ముఖ్యమైన రోజుల్లో గోదావరి పుణ్య స్నానాలు ఆచరించే వారు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో నగరంలో గోదావరి నదీ వెంబడి ఉన్న స్నానపు ఘాట్లను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నగర పాలక సంస్థపై ఉందన్నారు. అలాగే స్థానిక 4వ డివిజన్ చిన్న మసీదు నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మూడు కల్వర్టులు నిర్మించాలని కమిషనర్ను కోరారు. అల్యూమినియం అసోయేషన్ వారు సమస్యలు పరిష్కరించాలని, ఆర్చరీ వారికి శిక్షణ తీసుకునేందుకు వారి అభ్యర్ధన మేరకు స్థలం కేటాయించాలని కోరారు. మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ, టీడీపీ నాయకులు కరగాని వేణు, బేసరి చిన్ని తదితరులు వారి వెంట ఉన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: De-siltation should be carried out in the city

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *