పుంగనూరులోని మురుగునీటి కాలువలో పసికందుశవం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని చౌడేపల్లె రోడ్డులో గల కౌండిన్యనది కాలువ వద్ద గురువారం పసికందు శవాన్ని పట్టణవాసులు కనుగొన్నారు. ఈ విషయం అందరికి తెలియడంతో పసికందు శవాన్ని తీసుకెళ్లి కణనం చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో పోలుసులు పసికందు శవంపై దర్యాప్తు చేపట్టారు. కాగా నెలలు నిండకమునుపే ప్రశవమై పసికందు మృతిచెందడంతో కాలువలో పడేసినట్లు, కుటుంబ సభ్యులే పసికందు శవాన్ని పూడ్చివేసినట్లు పట్టణంలో చర్చించుకుంటున్నారు. కాగా వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Tags; Dead body of a baby in a sewage canal in Punganur
