Natyam ad

కుళ్లిపోయిన స్థితిలో మావోయిస్టు మృతుదేహం లభ్యం

దంతేవాడ ముచ్చట్లు:


చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దంతెవాడ జిల్లా కువకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూసారస్ లోయ సమీపంలోని జియాకోర్టా అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమయింది. ఎనిమిది లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కమాండర్ దేవా అలియాస్ తిర్రా మద్కామి మృతదేహంగా  పోలీసులు గుర్తించారు. కటెకళ్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు దేవాఫై గతంలో సంఘవిద్రోహక చర్యలపై పలు కేసులు నమోదయి ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం మృతి చెందిన దేవా మృతదేహం వద్ద ఒక ఆయుధం,  బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు కమాండర్ దేవా మృతికి గల కారణాలపై విచారణ  ప్రారంభించినట్టు ఎస్పీ సిద్దార్ద్ తివారి వెల్లడించారు.

 

Tags: Dead body of Maoist found in decomposed state

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.