ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Date:15/07/2018

సూర్యాపేట ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం జిల్లాలోని కోదాడ మండలం కోమరబండ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. బంధువులంతా పని చూసుకుని టాటా ఏసీ ఆటోలో తిరిగి సొంతూరికి బయలుదేరారు. అంతలోనే వారిని మృత్యువు కబళించింది. వేగంగా ప్రయాణిస్తున్న ఆటో టైరు ఒక్కసారిగా పగలడంతో ఆదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో దాదాపుగా 25మంది ఉన్నట్లు తెలుస్తోంది.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో బంధువుల రోదనలు వర్ణనతీతం. మృతులంతా బంధువులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతిhttps://www.telugumuchatlu.com/dead-road-accident-three-killed/

Tags; Dead road accident .. Three killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *