Natyam ad

నామినేషన్ల గడువు ముగిసింది

– 26న పరిశీలన
-మొత్తం నామినేషన్లు
-29న ఉపసంహరణ

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పుంగనూరు అసెంబ్లి ఎన్నికలలో పోటీ చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు గురువారం గడువు ముగిసే సమయానికి 15 మంది అభ్యర్థులు , 35 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్‌వో మధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం మాత్రం 13 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండుసెట్ల నామినేషన్లు, ఆయన సతిమణి పి.స్వర్ణలత రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే తెలుగుదేశం అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డి రెండుసెట్ల నామినేషన్లు, ఆయన కుమారై చల్లా పూజారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే బిసివై పార్టీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్‌ మూడుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు ఎస్‌డిపీఐ పార్టీ తరపున షేక్‌ జమీర్‌, స్వతంత్ర అభ్యర్థిగా పి.ఫయాజ్‌ లు నామినేషన్‌ దాఖలు చేశారు.

26న పరిశీలన…

పుంగనూరు ఎమ్మెల్యే పదవికి దాఖలు చేసిన నామినేషన్లను ఆర్‌వో కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి పరిశీలిస్తామని ఆర్‌వో మదుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం అందించామన్నారు. అభ్యర్థి లేదా వారి తరపున ఏజెంట్లను పరిశీలనకు అనుమతిస్తామన్నారు. రాజకీయ పార్టీ నాయకులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పక్రియ నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

29న ఉపసంహరణ …

ఈనెల 29న ఎమ్మెల్యే పదవికి దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్‌వో తెలిపారు. నామినేషన్‌ పత్రాలను సాయంత్రం 3 గంటలలోపు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.

Tags:Deadline for nominations is over

Post Midle