యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

-ఇరవై మంది సజీవ దహనం

Date:11/01/2020

లక్నో  ముచ్చట్లు:

ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇరవై మందికి సైగా ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.  కన్నౌజ్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ట్రక్కుని ఢీకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. ఫరూఖాబాద్ నుంచి 46 మంది ప్రయాణికులతో జైపూర్ వెళ్తున్న ఏసీ బస్సు చిలోయి వద్ద ట్రక్కును బలంగా ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు తప్పించుకునే వీలు లేకుండాపోయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 21 మంది ప్రయాణికులను కాపాడారు. నాలుగు ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు. దాదాపు గంట సేపటితరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. డీజిల్ ట్యాంకు పగలడం వల్లే మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు.  క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.గాయాపడిన వారికి మేలైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ , కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

ప్రేమ.. వంచన..

Tags: Deadly road accident in UP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *