Date:08/05/2020
మహారాష్ట్ర ముచ్చట్లు:
కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది.
ఈప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.
మృతులంతా మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు.
పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.
కర్మాడ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వలస కార్మికులు గూడ్స్‌రైలును రాకను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఆర్పీఎఫ్, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు.
రాయలసీమలో ఉరుములు, పిడుగులతో వర్షాలు
Tags: Deadly train crash in Aurangabad