చెవిటి, మూగ వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

Deaf and dumb people should be given space

Deaf and dumb people should be given space

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని చెవిటి, మూగ వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఆదుకోవాలని ఆ సంఘ అధ్యక్షుడు ఇస్మయిల్‌బేగ్‌ ఆధ్వర్యంలో సభ్యులు కమిషనర్‌ కెఎల్‌.వర్మకు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఆయనను కార్యాలయంలో కలసి సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యుల సమస్యలను కమిషనర్‌ పరిష్కరించాలన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ చెవిటి, మూగ సంఘ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేకుండ చూస్తామని, ఈ విషయాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు జగదీష్‌కుమార్‌, వీరేంద్రనాథ్‌, అబ్ధుల్‌వాజీద్‌, అబ్ధుల్‌జావీద్‌, మహమ్మదాలి, జమాల్‌, బాబుసాహెబ్‌, మస్తాన్‌, తహసీన్‌, హరుణ్‌, అమరనాథ్‌, బాషాఖాన్‌, షణ్ముగబాబు తదితరులు పాల్గొన్నారు.

స్పందనకు సమస్యల వెల్లువ

Tags: Deaf and dumb people should be given space

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *