జగ్గంపేటలో అమర వీరుల వర్ధంతి

Date:21/11/2019

కాకినాడ  ముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో  అమరవీరుల వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  అరుణోదయ సమైక్య ఉభయ రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు  విమలక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జగ్గంపేట మెయిన్ రోడ్ లో రైతు కూలీ సంఘం సభ్యులతో ఎర్రజెండాల తో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా  జడ్ పి అతిథిగృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నవంబర్ మాసంలో  అమరులైన  కమ్యూనిస్టు, విప్లవకారులు కొరకు సంస్మరణ సభ అ జరుపుకోవడం జరుగుతుందన్నారు. కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు  రాష్ట్రాలలో ప్రభుత్వాధినేతలు  ప్రకృతి  ఇ విధ్వంసం నిర్బంధం  ఏకైక కార్యక్రమంగా  పాలిస్తున్నారు అని విమలక్క దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్ర అ జిల్లాలలో యురేనియం తవ్వకాల కోసం అనేక జిల్లాలలో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని, కృష్ణ నది జలాలను విషపూరితం చేసే కుట్ర సాగుతుందని దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలన్నారు.

 

 

 

 

భూమి కింద ఉన్న ఖనిజాలను  సామ్రాజ్యవాదులకు  కట్టబెట్టడానికి ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు పరుగులు పెడుతున్నాయని ఆమె అన్నారు. ప్రజలకు చెందాల్సిన భూములను  సెజ్ ల పేరుతో  గందరగోళం సృష్టించి, పాలకులు  ప్రస్తుతం భూములను అమ్మి  సంక్షేమ పథకాలకు  ఖర్చు చేస్తామనడం  ద్రోహం అన్నారు. ప్రజల భూమిని  అమ్మే హక్కు  ప్రభుత్వాలకు లేదన్నారు. అసంతృప్తి  రగులుతున్న అంతకాలం ప్రజా ఉద్యమాలు  ముందుకు వస్తాయని, అమరుల స్ఫూర్తితో  కమ్యూనిస్టు విప్లవ కారులు మమేకం అవ్వాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు పోలీస్ అందం రాష్ట్ర అధ్యక్షులు నంది నరసింహయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ రాయలసీమ ఐక్య వేదిక కన్వీనర్ రాజు అరుణోదయ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఇ మల్సూర్ కొండ దుర్గారావు అరుణోదయ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

వలసల తిప్ప బ్రిడ్జ్ ను ప్రారంభించిన సీఎం జగన్

Tags: Death of immortal heroes in Jaggampeta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *