కాంగ్రెస్ సంప్రాదాయలు వద్దంటూ చర్చ.
హైదరాబాద్ ముచ్చట్లు:
కాషాయదండులో గత కొన్నాళ్లుగా అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. రెబల్ నేతలు భారతీయ జనతా పార్టీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రహస్యంగా పదిహేను సార్లు భేటీ అయ్యారు. సంజయ్ సొంత జిల్లాకు చెందిన నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, అర్జున్‌రావులాంటి నేతలు ఏకంగా అసమ్మతిని హైదరాబాద్ వరకు రాజేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(లో రెబల్ బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. అధిష్టానం నిత్య అసమ్మతివాదులపై వేటు వేయాలని తుది నిర్ణయం జరిగిపోయింది. సరిగ్గా అదే టైంలో కీలక మలుపు చోటుచేసుకుంది.బీజేపీ తిరుగుబాటు నేతలు… రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌తో సంధి చర్చలకు దిగివచ్చారు. తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎకరువు పెట్టారు. గతంలో బండి సంజయ్‌తో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేశారు. తమకు సంజయ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని… చిన్నచిన్న అభిప్రాయబేధాలను సమావేశంలో చర్చించుకున్నారు. అసమ్మతి నేతలు పొరపాటును గ్రహించారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భావిస్తున్నారు. రెబల్ లీడర్స్ మాత్రం తమ పట్టు సాధించుకున్నామనే ధోరణిలో ఉన్నారు. సమావేశం తర్వాత ఎవరికి వారు పంతం నెగ్గిందని భావించినట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్ సాంప్రదాయం చర్చలు, బుజ్జగింపులు… కాషాయం దళం ఫాలో కావడం పట్ల పలువురు నేతలు అభ్యంతరం చెబుతున్నారు. అలిగిన ప్రతీసారి చర్చలు, బుజ్జగింపులతో సరిపెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కాషాయదండులో కొత్త కల్చర్ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తుంది.
Tags:Debate over congressional traditions