అసెంబ్లీలో  20 రోజులపై  చర్చలు

Date:30/11/2020

విజయవాడ ముచ్చట్లు

డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈసారి ప్రభుత్వం 19 బిల్లులను ప్రవేశపెట్టనుంది. 21 ఎజెండా అంశాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటు టీడీపీ సభను కనీసం పది రోజులైనా నిర్వహించాలని డిమాండ్ చేసింది.20అంశాలపై చర్చ జరగాల్సిందేనని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు బీఏసీలో ప్రస్తావించారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని.. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, పరిష్కరించేలా చేసేందుకు 5 రోజుల వ్యవధి సరిపోదన్నారు. టీడీపీ లేవనెత్తిన 20 అంశాలపై చర్చ జరగాలన్నారు.
1. భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం – నెల్లూరులో ధాన్యం కొనుగోళ్లు
2. ఎన్ ఆర్ఈజీఎస్ బకాయిలు నిలిపివేత
3. టిడ్కో ఇళ్ల పంపిణీ – ఇళ్ల పట్టాల భూసేకరణలో అవినీతి
4. దళితులు, మైనారిటీలపై దాడులు
5. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగింపు
6. నూతన ఇసుక పాలసీ – దోపిడీ
7. నిత్యావసర ధరల పెరుగుదల – ప్రజలపై భారాలు
8. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం
9. పెరుగుతున్న నిరుద్యోగం – మూతపడుతున్న పరిశ్రమలు
10. పీపీఏల రద్దు – జీవో నెం.25
11. ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులు – ప్రభుత్వ నిర్లక్ష్యం
12. మద్యం అమ్మకాలు – నాశిరకం బ్రాండ్లు
13. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల దుస్థితి– రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్, జీవో 21 రద్దు
14. సంక్షేమ పధకాలు రద్దు – సబ్ ప్లాన్ల నిర్వీర్యం
15. పెన్షన్ రెండో విడత పెంపు వైఫల్యం
16. కరోనా – సహాయ చర్యల్లో వైఫల్యం
17. పన్నులు పెంపు – ఆస్థి పన్ను
18. స్థానిక సంస్థల ఎన్నికలు
19. దేవాలయాలపై దాడులు
20. మితిమీరిన అప్పులు – దుబారా వంటి అంశాలపై చర్చ జరగాలన్నారు.

 

పులి చంపేస్తోంది…

Tags:Debates over 20 days in the Assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *