పుంగనూరులో ఓటిఎస్ పథకం క్రింద రుణవిముక్తులు -చైర్మన్ అలీమ్బాషా
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం పేద ప్రజలను రుణాల నుంచి విముక్తి చేసేందుకే ఓటిఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని 29వ వార్డులోని ఎన్ఎస్.పేట ప్రజలకు ఓటిఎస్ పథకం క్రింద మంజూరైన జగనన్న శాశ్వత భూహక్కు పత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరు ఓ టిఎస్ పథకం క్రింద డబ్బు చెల్లించి, లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాగేంద్ర , ముస్లిం మైనార్టీల నాయకుడు ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Debt relief under OTS scheme in Punganur – Chairman Aleem Basha
